BigTV English

Asia Team Championships 2024: భారత మహిళా బ్యాడ్మింటన్‌ జట్టు కొత్త చరిత్ర… ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ కైవసం..

Asia Team Championships 2024: భారత మహిళా బ్యాడ్మింటన్‌ జట్టు కొత్త చరిత్ర… ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ కైవసం..
sports news headlines

India Crowned Badminton For The First Time(Sports news headlines): భారత మహిళా బ్యాడ్మింటన్ టీమ్ కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ ను కైవసం చేసుకుంది. తొలిసారి విజేతగా నిలిచింది. గోల్డ్ మెడల్ గెలిచి సంబరాలు చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌ పోరులో థాయ్‌లాండ్‌ను భారత్ జట్టు ఓడించింది. 3-2 తేడాతోనూ ఆ జట్టుపై విజయం సాధించారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఆసియా ఛాంపియన్‌షిప్‌ను గెలవడం ఇదే తొలిసారు.


ఫైనల్‌లో థాయ్‌లాండ్‌ గట్టి పోటీ ఇచ్చింది. రెండు సింగిల్స్ మ్యాచ్ లో భారత్ ప్లేయర్స్ విజయం సాధించారు. డబుల్స్ లోనూ మనవాళ్లదే పైచేయిగా నిలిచింది. పీవీ సింధు, అన్ మోల్ ఖర్బ్ సింగిల్స్ లో విజయంసాధించారు. గాయత్రీ గోపిచంద్-త్రిశా జోలీ జోడీ డబుల్స్ లో గెలిచింది. రెండేళ్ల క్రితం భారత్ థామస్‌ కప్‌ ను గెలిచింది. ఆ తర్వాత భారత్ బ్యాడ్మింటన్ టీమ్ కు ఇదే పెద్ద విజయం.

సీనియర్‌ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌లో భారత్ కు శుభారంభాన్ని అందించింది. సింగిల్స్ మ్యా చ్ లో అద్భుతంగా ఆడి కేవలం 39 నిమిషాల్లోనే విజయం సాధించింది.
థాయ్‌లాండ్‌ ప్లేయర్ సుపనిద కతేతోంగ్‌పై 21-12, 21-12 తేడాతో సింధు జయభేరి మోగించింది. దీంతో భారత్‌ లీడ్ 1-0కి వెళ్లింది.


Read More: డ‘బుల్’.. యశస్వీ.. బద్ధలైన రికార్డ్స్..!

రెండో మ్యాచ్‌లో గాయత్రీ గోపిచంద్‌- త్రిశా జోడీ సత్తా చాటింది.థాయ్‌ షట్లర్లు కితిథరకుల్‌-రవ్విందాపై 21-16, 18-21, 21-16 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ ఆధిక్యం 2-0కు పెరిగింది. మూడో మ్యాచ్‌ సింగిల్స్ లో అష్మితా చలిహా ఓడిపోయింది. ఆమె బుసనన్‌ చేతిలో 11-21, 14-21 తేడాతో ఓటమి చవిచూసింది. ఇంకో డబుల్స్‌ మ్యాచ్‌ భారత్ జట్టుకు పరాజయమే ఎదురైంది.ట టీమ్‌ఇండియా శ్రుతి – ప్రియా జోడి 11-21, 9-21తో ఓటమిపాలైంది. దీంతో భారత్- థాయ్ లాండ్ జట్లు 2-2తో సమఉజ్జీగా నిలిచాయి. అయితే చివరి మ్యాచ్ లో అన్‌మోల్‌ అద్బుత ప్రదర్శన చేసింది. పోర్‌పిచాపై 21-14, 21-9 తేడాతో అన్ మోల్ గెలిచి భారత్‌కు స్వర్ణం సాధించిపెట్టింది.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×