Team India: ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు చిన్నచిన్న మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇలా విడాకులు తీసుకున్న జంటలలో ప్రముఖ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ జంట కూడా ఒకటి. ఇటీవల ఈ జంట తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. 2020 డిసెంబర్ లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంట.. ఈ ఏడాది మార్చ్ 20న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
Also Read: Ashwin Ball Tampering: బాల్ టాంపరింగ్ వివాదంలో అశ్విన్.. ఇక పై ఆడకుండా బీసీసీఐ బ్యాన్?
ఈ పరిణామం అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. వివాహం అనంతరం రెండు సంవత్సరాల పాటు కలిసి జీవించిన ఈ జంట.. 2025 ఐపీఎల్ ప్రారంభానికి ముందుగానే విడాకులు తీసుకుని ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇక ధనశ్రీ వర్మ తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా ధనశ్రీకి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే క్రేజ్ తో సినిమాలలోకి అడుగుపెట్టబోతోంది.
ధనశ్రీ వర్మ త్వరలోనే ఓ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో బలగం తర్వాత హర్షిత్, హన్సిత ఓ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే ధనశ్రీ వర్మ టాలీవుడ్ కి పరిచయం కాబోతోంది. ధనశ్రీ తో పాటు ఢీ ఫేమ్, స్టార్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ కూడా ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాల నటి కార్తిక మురళీధరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ధనశ్రీ వర్మను ఎంపిక చేశారట. భరతనాట్యం నుండి ఆధునిక నృత్యం వరకు వివిధ రకాల నృత్యాలలో ప్రావీణ్యం ఉన్న నటి కోసం మూవీ యూనిట్ వెతుకుతుండగా.. వారికి ధన శ్రీ వర్మ పేరు వినిపించిందట. ఇక ఈ చిత్రంలో పాత్ర నచ్చడంతో ధనశ్రీ వర్మ కూడా నటించేందుకు వెంటనే అంగీకరించిందని సమాచారం. అయితే ఈ చిత్రంలో ధనశ్రీ వర్మ ఏ పాత్రలో నటించబోతుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
Also Read: Triple Super Over: ఇదెక్కడి మాస్ రా…ఒకే మ్యాచ్ లో 3 సూపర్ ఓవర్లు.. కానీ చివరికి..
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైందని, ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో యష్ మాస్టర్ తో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ధనశ్రీ వర్మ కనిపించిందని పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్త తెలిసిన క్రీడాభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది నేటిజన్లు ధనశ్రీ వర్మను నోటికి వచ్చినట్లు తిడుతూ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెల్కమ్ చెబుతున్నారు.