BigTV English

IPL 2025 playoffs :ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

IPL 2025 playoffs :ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

IPL 2025 playoffs : ఐపీఎల్ 2025 లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లే ఆప్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచ్ లు గెలవాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దీని ప్రకారం.. చూసినట్టయితే ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్ లకు 6 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 8 మ్యాచ్ లకు 6 మ్యాచ్ లలో విజయం సాధించింది. రెండు మ్యాచ్ ల్లో మాత్రం ఓడిపోయింది. రన్ రేట్ కాస్త తక్కువగా ఉండటంతో 0.657 తో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు 9 మ్యాచ్ లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. మూడింటిలో ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్ ల్లో  ఐదింటిలో విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ నాలుగు జట్లు టాప్ 4లో కొనసాగుతున్నాయి.


Also Read :  Danish Kaneria On Modi : ప్రధాని మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..రెచ్చిపోయిన పాక్ మాజీ క్రికెటర్‌ !

పంజాబ్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ 9 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కేకేఆర్ 8 మ్యాచ్ లలో 3 మాత్రమే విజయం సాధించింది. 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 మ్యాచ్ లకు కేవలం 2 మ్యాచ్ ల్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్ ల్లో కేవలం 2 మ్యాచ్ ల్లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్ లు ఆడి కేవలం 2 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టిక లో మాత్రం చిట్టచివరగా కొనసాగుతోంది.


ఇక ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్  వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరైతే విజయం సాధిస్తారో వారు చివరి నుంచి మూడో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. వాస్తవానికి చివరి నుంచి నాలుగు జట్లకు ప్లే ఆప్స్ అవకాశాలు లేవని చాలా మంది పేర్కొంటున్నారు. కానీ గత సీజన్ లో ఆర్సీబీ తొలి 7 మ్యాచ్ ల్లో కేవలం1  ఒక్కే మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ఆ తరవాత వరుసగా 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి ప్లే ఆప్స్ కి అర్హత సాధించింది. ఈ సీజన్ లో కూడా ఆర్సీబీ మాదిరిగానే ప్లే ఆప్స్ కి అర్హత సాధిస్తామని హైదరాబాద్ కోచ్ వెటోరీ.. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లేమింగ్ పేర్కొనడం గమనార్హం. ఈ సీజన్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ముందంజలో ఉన్నాయి. వీటిని దాటి పంజాబ్ మినహా ఏ జట్టు కూడా అర్హత సాధించలేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఈ సీజన్ లో  ప్లే ఆప్స్ కి చేరాలంటే గుజరాత్ ఇంకా రెండు మ్యాచ్ లు గెలిస్తే సరిపోతుంది. అలాగే ఢిల్లీ కూడా 2, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 2, పంజాబ్ కింగ్స్ 3, లక్నో సూపర్ జెయింట్స్ 3, ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్ లు గెలవాలి. కేకేఆర్ 5, సన్ రైజర్స్ 6, చెన్నై సూపర్ కింగ్స్ 6 గెలవాలి. ఇక రాజస్థాన్ రాయల్స్ కి అవకాశం లేనట్టే కనిపిస్తోంది. వీటిలో ఏయే జట్లు ఎన్ని మ్యాచ్ లు గెలిచి ప్లే ఆప్స్ కి వెళ్తాయో వేచి చూడాలి మరీ.

Related News

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×