Yuvraj Singh: ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టయినా మీకెలాంటి ఆల్ రౌండర్ కావాలని అడిగితే.. యువరాజ్ సింగ్ లాంటి వాడు కావాలని ఠక్కున సమాధానం చెబుతాయి. అంతగా ప్రపంచ క్రికెట్ పై తన ప్రభావాన్ని చూపించాడు. అలాంటి యువరాజ్ ఒక వీడియో పోస్ట్ చేసి అందరి దృష్టి ఆకర్షించాడు.
ఇంతకీ విషయం ఏమిటంటే…డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మ కి తను పాఠాలు చెబుతున్న వీడియో ఒకదానిని అప్ లోడ్ చేశాడు. అందులో ఏం ఉందంటే, తనకి బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్పిస్తూ, షాట్ లు ఎలా కొట్టాలనే అంశంపై ట్రైనింగ్ ఇస్తున్నాడు.
అంతేకాదు పదేపదే అభిషేక్ కి హితబోధ చేస్తున్నాడు. నువ్వు సిక్స్ లే కాదు, సింగిల్స్ కూడా తీయమని చెప్పడం ఆ వీడియోలో కనిపించింది. ఒక దశలో నువ్వు చెప్పిన మాట వినవా? అని విసుక్కోవడం కూడా ఉంది. అయితే యువరాజ్ బయట ఎంత సరదాగా ఉంటాడో, గేమ్ లోకి వెళ్లింతర్వాత అంత సీరియస్ గా మారిపోతాడు. అది కోచింగ్ అయినా, గ్రౌండ్ అయినా ఒకటే అని మరోసారి నిరూపించాడు.
Also Read: పారాలింపిక్స్: టార్గెట్ కి దగ్గరలో భారత్
అయితే అభిషేక్ ని అందరూ అదృష్టవంతుడని కొనియాడుతున్నారు. లెజండరీ క్రికెటర్ యువరాజ్ లాంటి గురువు దొరికాడని మెచ్చుకుంటున్నారు.
మొత్తానికి ఆ వీడియో కింద యువరాజ్ కామెంట్ రాస్తూ…ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక నుంచి అభిషేక్ సాధ్యమైనన్ని ఎక్కువ సింగిల్స్ తీస్తాడని ఆశిస్తున్నట్టు తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ యువరాజ్ కోచింగ్ సూపర్బ్గా ఉందని.. అయితే పుట్టినరోజు కూడా క్రికెట్ పాఠాలేనా? యూవీ భయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అభిషేక్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ ఈ సీజన్లో దుమ్మురేపాడు. 16 మ్యాచుల్లో కలిపి 484 పరుగులు చేశాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో పాల్గొని..సెంచరీ కొట్టాడు. ఎవరికీ దక్కని అద్భుతమైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో జాతీయ జట్టులో స్థానం దొరకాలని, మరిన్ని సెంచరీలు చేయాలని మనం కూడా కోరుకుందాం.
Happy birthday sir Abhishek 🙏🏻 🎂 hope you take as many singles this year as many as you knock out of the park 🤪 Keep putting in the hard work! loads of love and wishes for a great year ahead! ❤️ @IamAbhiSharma4 pic.twitter.com/Y56tQ2jGHk
— Yuvraj Singh (@YUVSTRONG12) September 4, 2024