Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే వరదలు వచ్చాయని అన్నారు. వరదలు వస్తే ఎలా వ్యవహించాలనే విషయం కూడా చంద్రబాబుకు తెలియదన్నారు. కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా అనుమతి లేని బఫర్ జోన్ లో ఉన్న ఇంట్లో సీఎం ఉంటున్నారని అన్నారు. వరదలు రావడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లును కూల్చేసి పవన్ శభాష్ అనిపించుకోవాలన్నారు.
గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. ఈ సందర్భంగానే చంద్రబాబుపై విమర్శలు చేశారు. విజయవాడలో వరదలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని అన్నారు. విజయవాడలో పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారిందని తెలిపారు. ఒక్కొక్కటిగా మృతదేహాలు బయట పడుతున్నాయని అన్నారు. వైఎస్ జగన్ వల్లే ఇదంతా జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.. కానీ చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయని అంబటి ఆరోపించారు.