Wahab Riaz On IND VS PAK: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) తుది అంకానికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా ఉమెన్స్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ రేపు జరగనుండగా… ఎల్లుండి పాకిస్తాన్ వర్సెస్ లంక మధ్య రెండో సెమీ ఫైనల్ ఉండనుంది. ఇక ఫైనల్ సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మహిళల జట్టు కోచ్ వహాబ్ రియాజ్ (Wahab Riaz). ఆసియా కప్ ఫైనల్స్ లో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఫైనల్స్ లో టీమిండియాకు నరకం చూపించి… 10 వికెట్ల తేడాతో విజయం సాధిస్తామని డేంజర్ బెల్స్ పంపించారు వహాబ్ రియాజ్.
ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్ 2026 లో (Women’s Asia Cup 2026 Tournament) భాగంగా గ్రూప్ స్టేజ్ లో టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (Wahab Riaz On IND VS PAK) మధ్య మ్యాచ్ జరిగింది. మొన్న సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఉమెన్స్ టీం చిత్త ప్రదర్శన కనబరిచి దారుణమైన ఓటమిని చవి చూసింది.
అయితే ఈ మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉమెన్స్ టీం తో పాటు కోచ్ వహాబ్ రియాజ్ దారుణంగా ట్రోల్లింగ్ చేశారు. అయినప్పటికీ సెమీ ఫైనల్ కు పాకిస్తాన్ జట్టు చేరుకుంది. ఈ క్రమంలో టీమిండియా మహిళల జట్టుకు వహాబ్ రియాజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆసియా కప్ మహిళల టోర్నమెంట్ ఫైనల్స్ లో కచ్చితంగా టీమిండియాను ఓడిస్తామని శపథం చేశారు. ఫైనల్స్ లో 10 వికెట్ల తేడాతో ఇండియాను ఓడిస్తామని వెల్లడించారు.
ఆసియా కప్ (Women’s Asia Cup 2026 Tournament) గెలవడం వద్దని.. కేవలం టీమిండియాను మాత్రమే ఓడించి చూపించాలంటూ పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై అభిమానులు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనికి తగ్గట్టు గానే తాజాగా పాకిస్తాన్ హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ ( Wahab Riaz) సంచలన ప్రకటన చేశారు. తమకు ఆసియా కప్ 2026 టైటిల్ అవసరం లేదని వెల్లడించారు. ఫైనల్స్ లో టీమిండియాను ( Team India) ఓడించి.. ఏడిపించడమే తమ అంతిమ లక్ష్యం అంటూ ప్రకటన చేశారు. ఆ దిశగా వ్యూహరచనలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు.