BigTV English

IND vs AFG T20 Series : టీ20లకు యువ కెప్టెన్ వచ్చాడు .. భారత్ ముందు నిలబడతాడా?

IND vs AFG T20 Series :  టీ20లకు యువ కెప్టెన్ వచ్చాడు .. భారత్ ముందు నిలబడతాడా?
IND vs AFG T20 Series

IND vs AFG T20 Series : జనవరి 11 నుంచి భారత్ లో మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఆఫ్గనిస్తాన్ మొత్తం 19 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. తమ తురుపు స్పిన్నర్ రషీద్ ఖాన్ ని కాదని కొత్తగా యువ కెప్టెన్ జద్రాన్ ను ఎంపిక చేసింది. అయితే రషీద్ ఖాన్ కి జట్టులో చోటు కల్పించారు. కానీ కెప్టెన్సీ మాత్రం ఇవ్వలేదు.


ఎందుకంటే రషీద్ ఖాన్ ఇటీవల వెన్నుపూసకి ఆపరేషన్  జరిగింది. ఆ గాయంతో చాలా మ్యాచ్ లు ఆడలేదు.
యూఏఈ వేదికగా జరిగిన సిరీస్‌లో ఇబ్రహీమ్ జద్రాన్ సారథ్యంలో ఆఫ్గనిస్తాన్ విజేతగా నిలిచింది. అందుకే భారత్‌ లో జరిగే సిరీస్‌ కి అతనే కెప్టెన్‌గా కొనసాగుతాడని ఏసీబీ తెలిపింది.

అయితే రషీద్  ఖాన్ జట్టుతో మాత్రం ఇండియా పర్యటనకు వస్తున్నాడు. అవకాశాన్ని బట్టి ఆడతాడా? లేదా? అనేది తెలుస్తుంది. ఆఫ్గనిస్తాన్ ని చూసైనా, సీనియర్లను ఎలా గౌరవించాలో బీసీసీఐ, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్లు నేర్చుకోవాలని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ పట్ల చూపించిన విధానం, ఫ్రాంచైజీకి వచ్చిన చెడ్డపేరు చరిత్రలో నిలిచిపోయేలా చేసుకుంది. రోహిత్, కొహ్లీలను ఎంపిక చేసి ఆ పరిస్థితి నుంచి బీసీసీఐ తృటిలో తప్పించుకుంది.

రషీద్ ఖాన్ కి ఒక సీనియర్ గా గౌరవమిచ్చి, జట్టుతో పాటు తీసుకొస్తున్నారు. అదే టీమ్ ఇండియాకి రెండు కళ్లు లాంటి రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలను తీసుకోడానికి నానా యాగీ చేశారు. రాద్ధాంతం చేశారు. పెద్ద సీన్ క్రియేట్ చేశారని విమర్శిస్తున్నారు.


ఆఫ్గనిస్తాన్ జట్టు ఇదే… ఇబ్రహీమ్ జడ్రాన్(కెప్టెన్), రషీద్ ఖాన్, గుర్బాజ్, హజాయ్, అలిఖిల్, రెహ్మాత్ షా, మహమ్మద్ నబీ, జడ్రాన్, జనత్, ఓమార్జాయ్, అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజలక్ ఫరూఖీ, మాలిక్, నవీన్ ఉల్ హక్, అహ్మద్, సలీమ్, అహ్మద్,నైబ్, రషీద్ ఖాన్

జనవరి 11న మొహలీలో తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. రెండో టీ 20 జనవరి 14న ఇండోర్ లో,  మూడో టీ 20 జనవరి 17న బెంగళూరులో జరగనున్నాయి. మ్యాచ్ లు ఎప్పటిలా రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×