BigTV English

One Banana For Rs.500: ఒక అరటి పండు రూ.500 పైనే.. అక్కడికి వెళితే డబ్బులున్నా ఆహారం కొనలేం

One Banana For Rs.500: ఒక అరటి పండు రూ.500 పైనే.. అక్కడికి వెళితే డబ్బులున్నా ఆహారం కొనలేం

One Banana For Rs.500| ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరికీ ఆకలి వేస్తుంది. కానీ ఆకలి వేసినప్పుడు ఆహారం లభించకపోతే ప్రతి జీవి అల్లాడిపోతుంది. మనిషి కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే మనుషులు డబ్బు అనే సాధనం ద్వారా ఎక్కడికి వెళ్లినా తమకు కావాల్సిన ఆహారం ఇతర సౌకర్యాలు కొనుగోలు చేయగలరు. కానీ ఒక ప్రాంతంలో మాత్రం ఆహారం విపరీత ధరలకు విక్రయిస్తుండడంతో సామాన్యులు అక్కడికి వెళితే పస్తులుండాల్సిన పరిస్థితి.


ఆ ప్రాంతం మరెక్కడో కాదు టుర్కీయే దేశంలోని ఇస్తాన్ బుల్ విమానాశ్రయం. ఈ అంతర్జాతీయ ఎయిర్ పోర్టును ప్రయాణికులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎయిర్ పోర్ట్ గా వర్ణిస్తున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ మీదుగా ప్రయాణించాలంటేనే తమకు భయంగా ఉంటుందని.. అక్కడి ధరలు అంతటి స్థాయి భయపెడతాయని చెబుతున్నారు.

ఇక్కడ సాధారణ ఫుడ్ ఐటెమ్స్ కూడా భారీ ప్రీమియం ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఒక నార్మల్ అరటి పండు అక్కడ 5 పౌండ్లు (భారత కరెన్సీలో రూ.565). ఒక నాన్ ఆల్కహాలిక్ బీర్ 15 పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.1,697. పైగా ఎయిర్ పోర్ట్ లో ఏదైనా కొనుగోలు చేయాలంటే మీ దేశీయ కరెన్సీని వారు స్వీకరించరు. అక్కడ డాలర్లు, పౌండ్లు, లేదా టుర్కీయే స్థానిక కరెన్సీ ఉండాలి. అది లేకపోతే ఎయిర్ పోర్ట్ లోనే ఫారిన్ కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ఉంటుంది.


ఆ ఫారిన్ కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ కౌంటర్ వద్దకు వెళ్లి మీ దేశీ కరెన్సీ మార్చుకోవాలంటే అందుకు వారు కమిషన్ కట్ చేసుకుంటారు. ఆ పైన కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ధర వల్ల ప్రయాణికుడికి పెద్ద గుండు కొడతారు. అంతా కలిపి భారీగా ఖర్చు అవుతుంది. చివరికి ఎయిర్ పోర్ట్ లో ఏదైనా కొనుగోలు చేయాలంటే ఈ కష్టాలన్నీ దాటాలి. టుర్కీయే దేశంలో ఇదే ప్రధాన ఎయిర్ పోర్ట్ కావడంతో ప్రతి రోజు ఈ మార్గంలో 22,000 మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తుంటారు. వారంతా ఈ భారీ ఖర్చుతో విసిగిపోతున్నవారే.

Also Read: జైలులో ఖైదీలకు ఆ వసతులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో ఒక రూమ్‌లో..

ఇటీవలే యురోప్ దేశమైన ఇటలీకి చెందిన ఒక వార్తా పత్రిక ఈ ఇస్తాన్ బుల్ ఎయిర్ పోర్ట్ ని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఎయిర్ పోర్ట్ గా వర్ణిస్తూ ఒక కథనం ప్రచురించింది. ఆ ఎయిర్ పోర్ట్ లో యూరోప్ విమానాశ్రయాల కంటే ఎక్కువ రేటుకి ఆహారం, డ్రింక్స్ విక్రయిస్తున్నారని ఈ కథనంలో ఉంది. యురోపియన్లు లసాగ్నా అనే వంటకాన్ని బాగా ఇష్టపడి తింటారు. దీని గురించి ఒక ఇటాలియన్ రైటర్ మాట్లాడుతూ.. తాను ఇస్తాన్ బుల్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లినప్పుడు 90 గ్రాముల లసాగ్నా కొనుగోలు చేస్తే అందుకు 21 పౌండ్లు (భారత కరెన్సీ రూ.2,376) చెల్లించాల్సి వచ్చిందని.. అంత చెల్లించినా దాని క్వాలిటీ బాగోలేదని తెలిపాడు. దాని కంటే మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ లో ధరలు తక్కువగా ఉంటాయని రాశాడు.

అక్కడ ధరలు మరీ దారణం.. జర్మనీ పౌరుడు
రెడ్డిట్ లో ఒక పోస్ట్ షేర్ చేసిన ఒక జర్మనీ పౌరుడు ఇస్తాన్ బుల్ ఎయిర్ పోర్ట్ గురించి రాస్తూ.. “ఆ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల నుంచి మరీ దారుణంగా ధరలు వసూలు చేస్తున్నారని.. ఇది జర్మనీలోని ఫ్రాకంక్ ఫర్ట్ ఎయిర్ పోర్ట్ కంటే 2 నుంచి 4 రెట్లు ఎక్కువని వాపోయాడు. ఎందుకు ఇంతటి స్థాయిలో అక్కడ ధరలు పెట్టారో కారణం తెలియదు. అక్కడ టెర్మినల్ చాలా బాగుంది.. కానీ ధరలు చూసి భయమేస్తుంది.” అని చెప్పాడు. ఇదే విధంగా అమెరికన్లు కూడా స్పందించారు. అమెరికా ఎయిర్ పోర్ట్ కంటే ఇస్తాన్ బుల్ ఎయిర్ పోర్ట్ లో ధరలు బాగా ఎక్కువని చెప్పారు.

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×