Big Stories

Hyderabad Airport Metro Rail: మెట్రో ప్రయాణికులకు శుభవార్త

Hyderabad Airport Metro Rail Plan(Latest news in Hyd): శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో మార్గంలో 13 మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మొత్తం 14 కిలో మీటర్ల మేరా 13 స్టేషన్లను నిర్మించబోతున్నట్లు హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

నాగోల్, నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, ఎల్బీనగర్ కూడలి, సాగర్ రింగ్ రోడ్డు.. ఇలా మొత్తం 13 స్టేషన్లు రాబోతున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి, వాటి పేర్లను ఎంపిక విషయంలో ప్రజలు, ట్రాఫిక్ పోలీసుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆయన అధికారులకు సూచించారు. అంతకముందు ఆయా ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిశీలించి, అధికారులతో చర్చలు జరిపారు.

- Advertisement -

అయితే, నాగోల్ ఎయిర్ పోర్టు మార్గంలో నూతనంగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రో స్టేషన్ ను ప్రస్తుతమున్న నాగోల్ స్టేషన్ కు దగ్గరలోనే ఎడమవైపు నిర్మించనున్నట్లు, అదేవిధంగా ఈ రెండింటిని ప్రయాణికుల సౌలభ్యం కోసం కాన్ కోర్ లెవల్ లో కలుపుతూ విశాలమైనటువంటి స్కైవాక్ ను నిర్మించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, అయినా కూడా అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో ఆ సవాళ్లను అధిగమించి అద్భుతంగా కారిడార్ ను నిర్మిస్తామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News