BigTV English

Rachakonda Commissionerate : 2023 క్రైమ్ రిపోర్టు విడుదల.. 25 శాతం పెరిగిన సైబర్ నేరాలు..

Rachakonda Commissionerate : 2023 క్రైమ్ రిపోర్టు విడుదల.. 25 శాతం పెరిగిన సైబర్ నేరాలు..

Rachakonda Commissionerate : రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా ద్వారా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 6.8% నేరాల సంఖ్య పెరిగిందని తెలిపారు. గతేడాది 27,664 కేసులు నమోదు అవ్వగా.. ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయని సీపీ తెలిపారు.


చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాలు కేసులు తగ్గినట్లుగా పేర్కొన్నారు. నగరంలో చిన్నారుల పై లైంగిక దాడుల కేసులు, హత్యలు, కిడ్నాపులు ముందు కంటే పెరిగాయని సీపీ తెలిపారు. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ చేసినట్టు తెలిపారు. 282 డ్రగ్స్ కేసుల్లో 698 మందిని అరెస్టు చేశారని సీపీ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోనీ అన్ని నేరాల్లో 21.66 కోట్ల నష్టం జరిగితే.. అందులో 12.77 కోట్లు రికవరీ చేశారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 2 శాతం రికవరీ రేట్ పెరిగిందిని స్పష్టం చేశారు.

కమిషనరేట్ పరిధిలో 16,594 కేసులు నమోదైనట్లు వివరించారు. అందులో 2,900 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు అయ్యాయని తెలిపారు. ఈ ఏడాది 3321 రోడ్డు ప్రమాదాలు జరగయన్నారు. అందులో 633 మంది మృతి చెందగా.. 3,205 మందికి గాయాలు అయ్యాయని సీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 16 శాతం రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయన్నారు. యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా ఈ ఏడాది 56 కేసుల్లో 153 మంది నిందితులను అరెస్ట్ చేశారాని, 71 మంది బాధితులకు విముక్తి కలిగించామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన 8,758 ఫిర్యాదులో 4,643 పరిష్కరించారని సీపీ పేర్కొన్నారు.


ఈ ఏడాది నేరాల్లో 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయన్నారు. కన్విక్షన్ రేట్ 62 శాతం పెరిగిందని తెలిపారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని తెలిపారు. ఈ ఏడాది సైబర్ నేరాలు 2,562 కేసులు నమోదయ్యయని చెప్పారు. ఈ ఏడాది 282 మాదకద్రవ్యాల కేసుల్లో 698 మందిని అరెస్టు చేశారని తెలిపారు. అందులో 12 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. మానవ అక్రమ రవాణా 58 కేసులో 163 మంది అరెస్టు చేసినట్లుగా, ఆరుగురిపై పీడీ యాక్ట్ పెట్టారని సీపీ తెలిపారు.

గేమింగ్ యాక్ట్ పై 188 కేసులు నమోదు చేయగా వాటిలో 972 మందిని అరెస్ట్ చేశారని చెప్పారు. రాచకొండ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే 6.86% నేరాలు పెరిగయని సీపీ వెల్లడించారు.
రాచకొండ పరిధిలో సైబర్ నేరాలు 25శాతం పెరిగాయన్నారు. మహిళపై నేరాలు 6.65 శాతం తగ్గాయని సీపీ తెలిపారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×