Shubman Gill: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024- 2025లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా… ప్రస్తుతం టీమిండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య ఐదవ టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టులో… మంచి టచ్ లోకి వచ్చిన టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు. దీంతో లంచ్ సమయానికంటే ముందు.. పెవిలియన్ కు వెళ్లిపోయాడు టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ). అయితే గిల్ అలా అవుట్ కావడంపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read: IND VS AUS 5Th Test: జట్టు నుంచి రోహిత్ తొలగింపు..పీకల్లోతు కష్టాల్లో టీమిండియా..స్కోర్ ఎంతంటే? !
టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) స్టుపిడ్ అంటూ… పోస్టులు పెడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్. వాస్తవంగా లంచ్ సమయానికి ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ లైన్ ( Lyon ) బౌలింగ్ వేస్తున్నాడు. అయితే ఆ ఒక్క బంతి డిఫరెంట్ ఆడితే సరిపోయేది. కానీ టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) రెచ్చిపోయాడు. క్రీజు వదిలి ముందుకు వచ్చి మరి.. భారీ షాట్ ఆడబోయాడు శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ).
కానీ బంతి బాగా టర్న్ కావడంతో.. శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) బ్యాట్ ఎడ్జ్ కు తగిలింది. ఇంకేముంది స్లిప్ లో ఉన్న స్టీవెన్ స్మిత్ ( Smith)… చేతిలో బంతి పడిపోయింది. దీంతో లంచ్ కంటే ముందు శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) అవుట్ కావాల్సి వచ్చింది. అయితే దీనిపై గిల్ ను ఉద్దేశించి దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఆ ఒక్క బంతి ఆడితే సరిపోయేది కదా… ఎందుకు స్టుపిడ్ షాట్ ఆడావు…? అంటూ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill )పై నిప్పులు జరుగుతున్నారు టీమిండియా ఫ్యాన్స్.
Also Read: Ram Charan – Hardik Krunal: గేమ్ చేంజర్ కోసం రంగంలోకి టీమిండియా ప్లేయర్లు!
ఈ అటు శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) ఆడిన షాట్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. కాస్త ఓపికగా గిల్ ఆడితే సరిపోలేదని.. మనకు స్పష్టంగా ఆ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. ఇక ఔట్ అయ్యే సమయానికి గిల్ 64 బంతులు ఆడి 20 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు కూడా ఉన్నాయి. మంచి టచ్ లోకి వచ్చే సమయానికి శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) కొంపముంచేశాడు.
ఇది ఇలా ఉండగా… ఇవాల్టి మ్యాచ్లో రోహిత్ శర్మ లేకుండానే టీమ్ ఇండియా బరిలోకి దిగింది. దీంతో టీమిండియా కెప్టెన్ గా బుమ్రా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే గతంలో ఆడినట్లుగానే టీమ్ ఇండియా బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఇప్పటివరకు 32 ఓవర్లు వాడిన టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 76 పరుగులు మాత్రమే చేసింది. మరోసారి విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. 17 పరుగుల కి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం పంత్ అలాగే రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నారు.
Very Very Poor From Shubman Gill He Should Knew This Was Last Ball
Before Lunch But He Was Stupid Stupid Stupid Here 😠..#ShubmanGill #INDvsAUS#INDvAUS #ViratKohli𓃵#AUSvsIND pic.twitter.com/CvOPfanCbW— vinod gurjar (@Alwar202) January 3, 2025