E-Paper
Advertisement

Kite Festival Hyderabad : పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్

Kite Festival Hyderabad : పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
Advertisement

Kite Festival Hyderabad : 

⦿ 13వ తేదీ నుంచి 15 వరకు నిర్వహణ
⦿ హాజరుకానున్న 20 దేశాల సభ్యులు
⦿ వెల్లడించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ : సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్‌లో 20దేశాల సభ్యులు పాల్గొంటారని తెలిపారు. తెలుగు ప్రజలంతా ధాన్యం ఇంటికొచ్చిన సంతోషకర సందర్భంలో ప్రతీ ఏటా మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారని.. అదే విధంగా హైదరాబాద్ నగరంలో సంక్రాంతి వచ్చిందంటే లక్షలాది మంది కైట్ ఫెస్టివల్‌లో పాల్గొని పతంగులు ఎగురవేస్తారన్నారు. అవి చూసేందుకు వచ్చిన వారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరుగుతాయని, ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఫెస్టివల్‌ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.

ALSO READ : ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన.. డిజైన్లలో మార్పులు-చేర్పులు

Related News

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

Big Stories

Advertisement
×