E-Paper
Advertisement

1980s ఫోటో ట్రెండ్ వెనుక పెద్ద స్కామ్.. సైబర్ క్రైమ్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!

1980s ఫోటో ట్రెండ్ వెనుక పెద్ద స్కామ్.. సైబర్ క్రైమ్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

80s Photo Trend: ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న 80s ట్రెండ్‌ తో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ట్రెండింగ్ పేరుతో వచ్చే APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు. తెలియని యాప్స్ ఇన్ స్టాల్ చేస్తే ఫోన్ లోని ఫొటోలు, డేటా.. సైబర్ కేటుగాళ్ల చేతులోకి వెళ్లి దుర్వినియోగం అయ్యే ప్రమాదమని పేర్కొన్నారు. అటు వెబ్ సైట్లలోనూ వ్యక్తిగత ఫొటోలు అప్ లోడ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

వ్యక్తిగత ఫొటోలు బయటకు వెళ్తే.. వాటిని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడే అవకాశముందని సైబర్ పోలీసులు హెచ్చరించారు. దీనివల్ల మహిళలు మరింత ఎక్కువ సమస్యలు ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. ఏఐ టూల్స్‌తో ఫోటోలను మార్ఫింగ్ చేసి నకిలీ ఫోటోలు, వీడియోలు సృష్టించే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు ఇతరుల ఫోటోలను వారి అనుమతి లేకుండా ట్రెండ్ పేరుతో పోస్ట్ చేయొద్దని సూచించారు.

Advertisement

Also Read: 80’s సోకులు.. ఏఐతో హంగులు.. జెన్ జీ ఫుల్ ఫిదా, ఎందుకంటే?

Advertisement

మరోవైపు 1980s ఫోటో ట్రెండ్ కోసం వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ట్రెండ్ పేరుతో APK ఫైల్ పంపించే వ్యక్తులు, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫోటోలు, ఎవరికి పడితే వారికి పంపి.. వ్యక్తిగత గోప్యతను ప్రమాదంలోకి నెట్టుకోవద్దన్నారు. ఇప్పటికే అనుమానాస్పద యాప్ డౌన్‌లోడ్ చేసి ఉంటే వెంటనే తొలగించి బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు. లేదంటే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని హితవు పలికారు.

Also Read: చిరిగిన చొక్కాలు, చెరగని చిరునవ్వులు.. 80s నాటి ‘నేల టికెట్’ కిక్కే వేరబ్బా!

Tags

Related News

అవార్డులు ప్రతిభకా.. లేక పరిచయాలకా.. ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో దారుణం!

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

జీహెచ్ఎంసీలో ష్.. గప్ ‌చుప్ రూల్.. ఉన్నతాధికారుల సీక్రెట్ ఆంక్షలు!

ఇల్లు లేదా కొత్త ప్లాట్ కొంటున్నారా.. అయితే హైడ్రా మీకు గుడ్ న్యూస్!

నాడు ఎన్నికల్లో.. నేడు పరిపాలనలో.. రేవంత్ మైండ్ గేమ్‌లో ఇరుక్కున్న బీఆర్ఎస్!

తెలంగాణ అసెంబ్లీలో నేడు క్యూర్ బిల్లుపై చర్చ? రాబోయే కీలక మార్పులు ఇవే!

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. దిక్కుతోచని స్థితిలో గులాబీ ఎమ్మెల్యేలు!

Big Stories

Advertisement
×