E-Paper
Advertisement

సైకిల్ బెల్ వినిపిస్తే చాలు.. ఉత్తరం వచ్చిందనే ఆనందం, అప్పుడు డబ్బాలు.. ఇప్పుడు ఫోన్లు!

సైకిల్ బెల్ వినిపిస్తే చాలు.. ఉత్తరం వచ్చిందనే ఆనందం, అప్పుడు డబ్బాలు.. ఇప్పుడు ఫోన్లు!
Advertisement

అప్పట్లో దూరంగా ఉన్న సొంతవాళ్లని పలకరించడానికి అతిపెద్ద కమ్యూనికేషన్ వేపన్.. ఆ పసుపు రంగు పోస్ట్‌కార్డ్. కేవలం 15 పైసలకే దొరికే ఆ చిన్న కాగితం ముక్కపై పసుపు కుంకుమలు అద్ది.. ఇక్కడ మేము అంతా క్షేమంగా ఉన్నాం.. భగవంతుని దయ వల్ల అక్కడ మీరు కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను.. అంటూ మొదలు పెడితే.. అబ్బా.. కాసేపు ఆ ఊహల్లో తేలినట్టుంది. అందులో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నెక్స్ట్ లెవల్.. డబ్బులు లేకపోయినా, పలకరింపులు ఆగకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రతీ ఇంట్లో ఐదారు కార్డులు ఎప్పుడూ స్టాక్ ఉండేవి.

ట్రింగ్.. ట్రింగ్.. బెల్ వినిపిస్తే చాలు..

వీధి చివర ‘ట్రింగ్ ట్రింగ్’ అని పోస్ట్‌మ్యాన్ సైకిల్ బెల్ వినపడితే చాలు.. పిల్లల నుంచి ముసలివాళ్ల దాకా వీధిలోకి పరుగెత్తేవారు. ఎర్రటి సంచిలోంచి ఆ పసుపు రంగు కార్డు బయటకు తీసి చేతిలో పెడితే.. ఆ రోజు ఆ ఇంట్లో ఒక వింతైన వైబ్ ఉండేది. చదువు రాని వాళ్లు పొరుగింటికి వెళ్లి నాయన మా బాబు నుంచి ఉత్తరం వచ్చింది.. కొంచెం చదివి పెట్టవా అని అడగడంలోని అమాయకత్వం, ఆ కబుర్లు వింటూ ఆనందబాష్పాలు రాల్చే సెంటిమెంట్ అప్పటి విలేజ్ ఇండియాకు ఎవర్ గ్రీన్ పిక్చర్.

బాక్సుల్లో వేస్తేనే..

Advertisement

ఉత్తరం రాయడంలోనే కాదు.. దాన్ని పంపడంలోనూ ఒక ఆర్ట్ ఉండేది. ఎర్రటి పోస్ట్ బాక్స్‌లో కార్డు వేసి, అది ఎప్పుడు చేరుతుందో అని న్యూస్ పేపర్ కోసం చూసినట్లు వెయిల్ చేసేవారు. ఇక హాస్టళ్లలో ఉన్న పిల్లలు కన్నవారికి రాసే కార్డులు, లవర్స్ గుసగుసలుగా రాసుకునే రహస్యాలు.. ఏళ్ల తరబడి ట్రంకు పెట్టెల్లో దాచుకునే అపురూపమైన మెమోరీస్. ప్రతీ చేతిరాత వెనుక ఒక మనిషి హార్ట్‌బీట్ స్పష్టంగా కనిపించేది.

ఇప్పుడు స్మార్ట్ ఫోన్లదే రాజ్యం

ఇప్పుడు లెటర్ బాక్స్‌లు మాయమై స్మార్ట్‌ఫోన్‌లు రాజ్యమేలుతున్నాయి! ఈరోజు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డిఎమ్‌లలో వేల మెసేజ్‌లు పంపుతున్నాం కానీ.. సీన్ చేశారా లేదా అనే ఆరాటమే తప్ప నాటి ఆత్మీయత ఎక్కడో మిస్ అవుతోంది. స్పీడ్ అండ్ కంఫర్ట్ పెరిగినా.. రోజులు తరబడి కాపలా కాసి, చేతికొచ్చిన ఆ పసుపు రంగు పోస్ట్‌కార్డ్‌ను గుండెలకు హత్తుకున్నప్పుడు కలిగిన ఆ కిక్ జెన్ జీకి తెలియదు.

Advertisement

Also Read: 1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!

Also Read: 80’s సోకులు.. ఏఐతో హంగులు.. జెన్ జీ ఫుల్ ఫిదా, ఎందుకంటే?

Tags

Related News

స్త్రీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం.. PCOS – PCOD మధ్య అసలు తేడా ఇదే!

80’s సోకులు.. ఏఐతో హంగులు.. జెన్ జీ ఫుల్ ఫిదా, ఎందుకంటే?

పొరపాటున కూడా..ఇలాంటి వినాయక విగ్రహాలు అసలు కొనొద్దు!

ఆస్తమా రోగుల కోసం సూపర్ మొక్క.. దీని ప్రత్యేకతలు తెలుసా

వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు నిమజ్జనం చేస్తారు? పుట్టుక వెనుక అసలు రహస్యం ఇదే!

మీ హ్యాండ్‌షేక్ బలహీనంగా ఉంటే గుండె సమస్యలు ఉన్నట్లే? గ్రిప్‌ స్ట్రెంగ్త్‌‌‌తో ఇలా తెలుసుకోండి

వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే..అపనిందలు వస్తాయా? అసలు రహస్యం ఇదే!

Big Stories

Advertisement
×