E-Paper
Advertisement

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!
Advertisement

Hero Glamour X 125 ABS Launched: హీరో మోటోకార్ప్ తన 125సీసీ బైక్ గ్లామర్ ఎక్స్ 125లో మరో కీలక అప్ డేట్ చేసింది. ఇప్పటి వరకు డ్రమ్, డిస్క్ బ్రేక్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మోడల్‌కు ఇప్పుడు సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ను తీసుకొచ్చింది. కొత్త వేరియంట్ ధరను రూ.1.01 లక్షలుగా నిర్ణయించింది. గ్లామర్ ఎక్స్ 125 మార్కెట్లోకి వచ్చిన తర్వాత కీలకమైన అప్‌ డేట్లలో ఇది ఒకటిగా చెప్పొచ్చు. ముఖ్యంగా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈ కొత్త వేరియంట్ ఉపయోగపడే అవకాశం ఉంది.

బ్రేకింగ్‌లో మరింత భద్రత!

కొత్త వెర్షన్‌లో సింగిల్-ఛానల్ ABSతో పాటు ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS) కూడా ఉంది. అకస్మాత్తుగా గట్టిగా బ్రేక్ వేసినప్పుడు ముందు చక్రం లాక్ అయ్యే అవకాశాన్ని ABS తగ్గిస్తుంది. దీంతో రైడర్‌ కు బైక్‌పై నియంత్రణ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. IBS ముందు, వెనుక బ్రేకింగ్‌ను సమన్వయం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రోజువారీ నగర ప్రయాణాల్లో అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చినప్పుడు ఈ వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుంది.

స్వల్పంగా పెరిగిన ధర 

Advertisement

కొత్త ABS వేరియంట్ ధరను చూసుకుంటే డిస్క్ వెర్షన్‌తో పోలిస్తే తేడా చాలా తక్కువగా ఉంది. గ్లామర్ ఎక్స్ 125 డ్రమ్ వేరియంట్ ధర రూ.89,999 కాగా, డిస్క్ వేరియంట్ రూ.99,999కు లభిస్తుంది. ABSతో వచ్చిన కొత్త మోడల్ ధర రూ.1.01 లక్షలు. అంటే, డిస్క్ వేరియంట్ కంటే కేవలం రూ.1,000 అదనంగా చెల్లిస్తే ABS భద్రతా ఫీచర్ లభిస్తుంది. అందుకే కొత్త బైక్ కొనాలని చూస్తున్న వారికి ఈ వేరియంట్‌ అనచ్చే అవకాశం ఉంటుంది.

125సీసీ ఇంజన్, మూడు రైడింగ్ మోడ్‌లు

గ్లామర్ ఎక్స్ 125లో 125సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 11.4 హెచ్‌పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. దీంతో రైడర్ తన అవసరాన్ని బట్టి బైక్ పనితీరును మార్చుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

భద్రతా అప్‌డేట్ వచ్చినప్పటికీ, ఇప్పటికే ఉన్న కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కంపెనీ కొనసాగించింది. వాటిలో క్రూయిజ్ కంట్రోల్, కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. దీంతో కొత్త వేరియంట్ కేవలం ABS జోడించిన మోడల్‌గా కాకుండా, ఫీచర్ల పరంగా కూడా ఆకర్షణీయంగా నిలుస్తోంది.

పోటీ మరింత పెరగనుందా?

125సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో ABS ఫీచర్ అందిస్తున్న మోడళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. TVS Raider 125, Honda CB125 Hornet వంటి బైక్‌లు ఇప్పటికే ఈ ఫీచర్‌తో మార్కెట్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్‌కు చెందిన Xtreme 125R కూడా ABSతో అందుబాటులో ఉంది. ఇందులో డ్యూయల్-ఛానల్ ABS ఆప్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో గ్లామర్ ఎక్స్ 125కు సింగిల్-ఛానల్ ABS తీసుకురావడం ద్వారా హీరో మోటోకార్ప్ ఈ విభాగంలో పోటీని మరింత పెంచింది.

Read Also: రెనాల్ట్ కార్లపై లక్షల్లో ఆఫర్లు.. డస్టర్‌పై ఏకంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..

Tags

Related News

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

రెనాల్ట్ కార్లపై లక్షల్లో ఆఫర్లు.. డస్టర్‌పై ఏకంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

Big Stories

Advertisement
×