E-Paper
Advertisement

చిరిగిన చొక్కాలు, చెరగని చిరునవ్వులు.. 80s నాటి ‘నేల టికెట్’ కిక్కే వేరబ్బా!

చిరిగిన చొక్కాలు, చెరగని చిరునవ్వులు.. 80s నాటి ‘నేల టికెట్’ కిక్కే వేరబ్బా!
Advertisement

80s Floor Ticket Memories: అది 1980ల సమయం.. థియేటర్‌లో స్క్రీన్ కి దగ్గరగా నేల మీద లేదా ఇసుకలో కూర్చుని చూసే సీటింగ్ కే ‘నేల టికెట్’ అని పేరు. ఆ నేల టికెట్ జస్ట్.. రూపాయి లేదా రూపాయిన్నర. కానీ దాన్ని దక్కించుకోవడం కోసం చేసే యుద్దానికి మాత్రం వెల కట్టలేం. కిటికీ దగ్గర క్యూ లైన్లలో తోపులాటలు జరిగి చొక్కాలు చిరిగిపోయినా, చేతులు తెగినా సరే.. ఎలాగోలా టికెట్ చేతికి చిక్కితే ప్రపంచాన్ని జయించిన అలగ్జాండర్ కంటే గొప్ప ఫీల్ ఉండేది.

ఇక నేల టికెట్ మీద లోపలికి వెళ్లాక అసలు కథ స్టార్ట్ అయ్యేది. నేల మీద కూర్చుని పైన స్క్రీన్ వైపు చూస్తూ.. హీరో ఎంట్రీ ఇవ్వగానే డోలు దెబ్బలు, ఈలలు, కాగితాల తుంపర్లు ఎగరేస్తూ చేసిన రచ్చే వేరు. రేకుల షెడ్డు థియేటర్లు ఆడియన్స్ సౌండ్ కి దద్దరిల్లిపోయేవి. పక్కన ఎవడు కూర్చున్నాడో.. వాడికి మన కాలు తగులుతుందా? చేయి తగులుతుందా? అనేది అనవసరం.. హీరో కనిపిస్తే జై కొడుతూ విజిల్స్ వేసే ఆ మాస్ ఫీలింగ్, అప్పటి థియేటర్ వైబ్ కి మాత్రమే సొంతం

Advertisement

అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా థియేటర్లు సైతం మార్పులకు లోనయ్యాయి. నేల టికెట్ కాస్త మెల్లగా ప్లాస్టిక్ చైర్లు, బెంచ్ క్లాస్, మల్టీప్లెక్స్ రీక్లైనర్ సోఫాలు దాటుకుని.. ఫైనల్ గా ఈ రోజుల్లో మన అరచేతిలోని స్మార్ట్‌ఫోన్ లో ప్రత్యక్షమైంది. Netflix, Prime, Aha అంటూ ఓటీటీలు రావడంతో.. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ బెడ్ మీద పడుకుని పాజ్ కొడుతూ సినిమాలు చూసే కంఫర్ట్ వచ్చేసింది.

Also Read: ఇప్పుడు క్రేజ్ తగ్గినా.. అప్పట్లో అదొక సంచలనం.. 80’s లో మ్యాగీ మేనియా చూసొద్దామా?

Advertisement

ఒకప్పుడు గంటల తరబడి లైన్లో నిలబడి రూపాయి నేల టికెట్ కొని చూసిన సినిమాలో ఉన్న కిక్.. ఈరోజు మనం ఓటీటీలో చూసే అన్‌లిమిటెడ్ సినిమాల్లో దొరకదేమో! టెక్నాలజీ పెరిగి లైఫ్ చాలా ఈజీ అండ్ ప్రైవేట్ అయిపోయింది కానీ.. నలుగురితో కలిసి కేకలు వేస్తూ, తోటి ప్రేక్షకులతో కలిసి ఎంజాయ్ చేసిన నేల టికెట్ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీనే!

Also Read: ఇప్పటి ఆర్భాటాలు లేవు కానీ.. 80ల్లో వినాయకచవితి మజానే వేరు.. ఆ రోజులు మళ్లీ రావు!

Tags

Related News

దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన వీరుల గాథ… నరనరాల్లో దేశభక్తిని రగిలించే పవర్ ఫుల్ ఎపిక్ సిరీస్

ఐఏఎస్ ఆఫీసర్ తీర్చుకున్న షాకింగ్ ప్రతికారం… ఊహకందని పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్

ఖాకీ డ్రెస్‌కి, క్రైమ్ సామ్రాజ్యానికి మధ్య సాగే రక్తపాతం… ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్

వింత వైరస్ దాడితో సర్వనాశనమైన ప్రపంచం… తెలుగులోనే ఈ స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

విలన్‌తో అమాయకపు అమ్మాయి బాడీ స్వ్యాప్… భయపెట్టే కామెడీ రోలర్‌కోస్టర్ రైడ్

సినిమా ప్రపంచం వెనుక ఉన్న అసలు రంగులు… నవ్వులతో పాటు కన్నీళ్లు పెట్టించే వినోదాత్మక ప్రయాణం

జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×