Telangana workers were Chosen to do work in Israel: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ తో యుద్ధం కొనసాగుతున్న కారణంగా కార్మికుల కొరత ఏర్పడింది. అయితే, ఈ కొరతను తీర్చడానికి తెలంగాణ నుంచి చాలామంది కార్మికులు ఇజ్రాయెల్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ లో నిర్మాణ పనుల కోసం 2,209 మంది కార్మికులు సైన్ అప్ చేసినట్లు సమాచారం. వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తరువాత, 905 మంది కార్మికులు ఇజ్రాయెల్ లో పని చేయడానికి ఎంపికచేయబడినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. తెలంగాణలో పనిచేస్తున్న కార్మికులు కార్పెంటర్లు, సిరామిక్ టైలర్లు, ప్లాస్టరర్లు, ఐరన్ బెండర్లు, అదేవిధంగా చాలామంది భారతీయులు యుద్ధ ప్రభావిత ప్రాంతంలో పనిచేసేందుకు సిద్ధమయ్యారు. వీరికి ఇజ్రాయిల్ కు చెందిన నిర్మాణ సంస్థ జీతం చెల్లించనున్నది. ప్రతి కార్మికుడు నెలకు రూ. 1.2 లక్షల నుండి 1.38 లక్షల వరకు సంపాదిస్తారని రిక్రూట్ మెంట్ బృందం తెలిపింది. సాధారణంగా అయితే, భారతదేశంలో నైపుణ్యం కలిగిన కార్మికులు పొందే వేతనం కంటే చాలా ఎక్కువ.
తెలంగాణ రిక్రూట్ మెంట్ ఈవెంట్ ఈ సంవత్సరం భారతదేశంలో మూడవది. ఇండియా మరియు ఇజ్రాయెల్ మధ్య ఓ ఒప్పందం ఉంది. దానిలో ఇజ్రాయెల్ వారి నైపుణ్యాలను పరీక్షించిన తరువాత భారతదేశం నుండి కార్మికులను నియమించుకుంటుంది. ఈ ఒప్పందం ప్రకారం పనిచేయడానికి వారిని ఇజ్రాయెల్ తీసుకువస్తుంది.
ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఈ ఏడాది జనవరిలో ఇలాంటి రిక్రూట్ మెంట్ డ్రైవ్ లు జరిగాయి. ఈ రిక్రూట్ మెంట్ ఈవెంట్ లకు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. యూపీలో 7,182 మంది అభ్యర్థులు, హర్యానాలో 1,370 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఏడు రోజుల ఎంపిక ప్రక్రియ అనంతరం యూపీ నుంచి 5,087 మంది అభ్యర్థులు, అదేవిధంగా హర్యానా నుంచి 530 మంది అభ్యర్థులు అక్కడికి వెళ్లేందుకు ఎంపికయ్యారు. అదేవిధంగా బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రలలో కూడా ఇటువంటి రిక్రూట్ మెంట్ డ్రైవ్ లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొంతమంది కార్మికులు భారతదేశం నుండి ఇజ్రాయెల్ కు వెళ్లారు. అయితే, మార్చిలో ఇజ్రాయెల్ – ఇరాన్ ల మధ్య ఘర్షణ కారణంగా ఇజ్రాయెల్ లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న కేరళకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కొంతకాలం పౌరులను ఇజ్రాయెల్ కు వెళ్లకుండా నిలిపివేసింది.
Also Read: ‘నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోను’
అయితే, ఇజ్రాయెల్ లో నిర్మాణ పనుల కోసం ఇతర దేశాల కార్మికుల అవసరం ఉంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం ప్రారంభానికి ముందు ఇజ్రాయెల్ నిర్మాణ పరిశ్రమలో సుమారు 80 వేల మంది పాలస్తీనియన్లు పనిచేశారు. అయితే, జనవరిలో అరబ్ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇజ్రాయెల్ పాలస్తీనియన్లకు వర్క్ పర్మిట్లను ఇవ్వడం నిలిపివేసింది.