BigTV English

BJP Navneet Rana Vs CM Revanth Reddy: నవనీత్‌పై కేసు పెట్టాల్సిందే.. సీఎం రేవంత్‌ డిమాండ్!

BJP Navneet Rana Vs CM Revanth Reddy: నవనీత్‌పై కేసు పెట్టాల్సిందే.. సీఎం రేవంత్‌ డిమాండ్!

CM Revanth Reddy Demands to Arrest BJP Navneet Rana: తెలంగాణలో ఎన్నికల వేడి చివరి అంకానికి చేరింది. ఓటర్లను ఆకట్టుకుని తనవైపు తిప్పుకునేందుకు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి వెనుకాడలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎంపీ సీటును ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఒకప్పటి టాలీవుడ్ నటి, ప్రస్తుతం బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ రానాను రంగంలోకి దించింది.


రెండురోజుల పర్యటనలో భాగంగా నవనీత్‌ రానా హైదరాబాద్‌కు వచ్చారు. కమలనాధుల భావజాలాన్ని బయట పెట్టుకున్నారు. విద్వేషాలతో ఓటర్లను ఆకట్టుకోవడం ఒక్కటే మార్గమని నిర్ణయించారు.. అదే బాటలో అడుగువేశారు. తాజాగా నవనీత్ రానా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, ఆమె వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు.

బీజేపీ మత ఉచ్చులో హిందువు, ముస్లిం సోదరులు పడవద్దని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన పార్లమెంటు సభ్యురాలు నవనీత్‌పై ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. ముఖ్యంగా మతాన్ని అడ్డుకుని ఓటర్లను రెచ్చగొట్టడం తీవ్రమైన నేరంగా వర్ణించిన ముఖ్యమంత్రి, ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు.


Also Read: Hindu-Muslim Population Report: హిందువులు తగ్గిపోతున్నారా? ఆ రిపోర్టులో ఏముంది?

అసలేం జరిగింది? పుష్కరకాలం కిందట ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ నేత నవనీత్ రానా కౌంటరిచ్చారు. 15 నిమిషాలు కాదు… కేవలం 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో… మళ్లీ ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదంటూ వ్యాఖ్యానించా రు. తాజాగా పరిణామాలను గమనించిన అసదుద్దీన్ ఓవైసీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 15 సెకన్లు కాదు.. గంట సమయం ఇస్తామని, ఏం చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు. టైమ్, ప్లేస్ చెబితే ఎక్కడికైనా వస్తామన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఎంఐఎం నేతలు.

ఇదిలావుండగా బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్‌రానాపై రంగారెడ్డి జిల్లాలో కేసు నమోదైంది. కాంగ్రెస్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపింది. షాద్‌నగర్ పోలీసుస్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసా? కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పాకిస్థాన్‌కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. దీనిపై ఫ్లయింగ్ స్వ్కాడ్ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేసింది.. తప్పకుండా మార్చుకుంటాం: రాహుల్ గాంధీ

Tags

Related News

Weather Alert: బలపడిన వాయుగుండం.. మరో మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. బయటకు రాకండి

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Big Stories

×