BigTV English

Hindu-Muslim Population Report: హిందువులు తగ్గిపోతున్నారా? ఆ రిపోర్టులో ఏముంది?

Hindu-Muslim Population Report: హిందువులు తగ్గిపోతున్నారా? ఆ రిపోర్టులో ఏముంది?
The Controversy Over a New Population Study From India: దేశంలో హిందువుల జనాభా తగ్గిపోతుంది. దేశంలో హిందూవుల సంఖ్య 7.82 శాతం తగ్గిపోయింది. ఎట్‌ ది సేమ్ టైమ్ ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగిపోయింది. ఇదీ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చెప్పిన విషయాలు. ఇంతకీ ఈ రిపోర్ట్‌లో పూర్తిగా ఏముంది? ఈ డేటా ఎప్పుడు సేకరించారు? ఎలా సేకరించారు? ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారు? ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్.. ఇదో స్వతంత్ర సంస్థ.. ఇండియన్ గవర్నమెంట్‌కు.. స్పెషల్‌గా ప్రైమ్‌ మినిస్టర్‌కు ఎకానమీతో పాటు.. ఇతర విషయాలకు సంబంధించిన సమస్యలపై సలహాలు ఇస్తుంది ఈ కౌన్సిల్..

 


ఈ కౌన్సిల్‌కు బిబేక్ దేబ్రాయ్‌ చైర్మన్‌గా ఉన్నారు. మరికొందరు సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడీ కౌన్సిల్‌ ఓ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. 1950 నుంచి 2015 మధ్య ప్రపంచ దేశాల్లో అంటే.. టు బి ఎగ్జాక్ట్‌ 167 దేశాల్లో ఆయా వర్గాలను అధ్యయనం చేసింది. ఒక్కో మతాన్ని ఆచరించే వారి సంఖ్య ఎంత ఉంది? ఈ 65 ఏళ్లలో ఎవరి సంఖ్య ఎంత పెరిగింది? ఎంత తగ్గింది? అనే దానిపై ఓ రిపోర్ట్‌ను తయారు చేసింది. ఇప్పుడీ రిపోర్ట్ దేశంలో ఓ సంచలనంగా మారింది. ఎందుకంటే అందులో ఉన్న డిటెయిల్స్ అలా ఉన్నాయి..

1950లో మన దేశంలో హిందూవుల జనాభా 84.68 శాతం. 2015 నాటికి అది 78.06 శాతానికి తగ్గిపోయింది. అంటే 7.82 శాతం తగ్గిపోయింది హిందూవుల జనాభా.. ఇక 1950లో ముస్లింల జనాభా 9.84 శాతం. 2015 నాటికి 14.09 శాతానికి పెరిగింది. అంటే 1950తో పోల్చితే 2015 నాటికి 43.15 శాతం పెరిగింది ముస్లింల జనాభా.. ఇక క్రిస్టియన్ల జనాభా.. 2.24 నుంచి 2.36 శాతానికి.. అంటే 5.38 శాతం పెరిగింది. సిక్కులు కూడా 1.24 నుంచి 1.85 అంటే.. 6.58 శాతం పెరిగింది. బౌద్ధులు కూడా 0.05 నుంచి 0.81 శాతానికి పెరిగారు. అయితే జైనులు 0.45 నుంచి 0.36 శాతానికి తగ్గిపోయారు. పార్సీలు కూడా బాగా తగ్గిపోయారు. ఇదీ ఇండియా గురించి కౌన్సిల్ ఇచ్చిన డేటా..


Also Read: కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్, నియంతృత్వానికి పోరాటం.. కలిసి రావాలంటూ,

నాట్ ఓన్లీ ఇండియా ఇలా అనేక దేశాల గురించి డేటా ఉంది ఈ రిపోర్టులో.. అయితే ఇండియాలో మెజార్టీ మతమైన హిందువుల సంఖ్య తగ్గిపోతుంటే.. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్, అఫ్గానిస్థాన్‌ వంటి దేశాల్లో మాత్రం మెజార్టీ మతస్తుల వాటా పెరుగుతోంది.. మైనార్టీల వాటా తగ్గుతోంది. బంగ్లాదేశలో ముస్లింల సంఖ్య 18 శాతం పెరిగింది. పాకిస్థాన్‌లో 10 శాతం పెరిగింది. ఇవి రిపోర్టులోని వివరాలు.. ఇక విశేషాలకు వద్ధాం.. ఈ రిపోర్ట్‌ రాగానే ప్రచారం మొదలైంది. హిందూవుల సంఖ్య తగ్గిపోతుంది.. ముస్లింల సంఖ్య దారుణంగా పెరిగిపోతుంది. చూడండి పక్క దేశాల్లో మెజార్టీ వర్గాలైన ముస్లింల సంఖ్య పెరుగుతుంటే.. ఇండియాలో మెజార్టీ వర్గమైన హిందూవుల జనాభా తగ్గిపోతుంది అని.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ రిపోర్ట్‌కు సంబంధించిన న్యూస్ వైరల్‌గా మారింది.

అయితే ఈ రిపోర్ట్‌ను మేము ఏ మాత్రం తప్పుపట్టడం లేదు.. తప్పని చెప్పడం లేదు. అయితే ఈ రిపోర్ట్‌ రిలీజైన టైమింగే ప్రస్తుతం కాంట్రవర్సీకి అసలు కారణం.. ఎందుకంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఫోర్త్‌ ఫేజ్‌ ఎలక్షన్స్‌ జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు రిలీజైంది ఈ రిపోర్ట్.. ఇప్పుడు దీని ఆధారంగా మిగతా ఎన్నికల ప్రచారాన్ని నడిపించేందుకు రెడీ అయ్యారు బీజేపీ నేతలు.. ఇప్పటికే ప్రధాని మోడీతో మొదలుపెడితే.. గల్లీ లీడర్‌ వరకు హిందూత్వ ఏజెండాపైనే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వారి ప్రచారానికి కొత్త అస్త్రంగా మారింది ఈ రిపోర్ట్. అయితే ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది కూడా ప్రధానమంత్రి సలహామండలినే కావడం ఇక్కడ విమర్శలకు కారణమైంది..

ఈ రిపోర్ట్‌పై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. ఓడిపోతామని తెలిసే.. బీజేపీ నేతలు హిందూ రాగం ఎత్తుకున్నారు. అందుకే ప్రజల్లో భయాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. అంతేకాదు అసలు ఏ లెక్కల ఆధారంగా కౌన్సిల్ ఈ లెక్కలను కట్టింది? అనేది కాంగ్రెస్‌ నేతలు వేస్తున్న సూటి ప్రశ్న.

Also Read: కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేసింది.. తప్పకుండా మార్చుకుంటాం: రాహుల్ గాంధీ

జనాభా లెక్కలు నిర్వహించినప్పుడు కూడా కుల, మతాలను పరిగణలోకి తీసుకోలేదు కదా.. మరి భారత్‌లో మతాల లెక్కలను ఎలా తీశారు అనేది వారి ప్రశ్న.. అంతేకాదు.. తాము ఎప్పటి నుంచో కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. ఆ డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు.. కానీ మతాల లెక్కలను మాత్రం చెబుతున్నారు. కులాల లెక్కలను కూడా తీస్తే బాగుండేది కదా అని చురకలు అంటిస్తున్నారు..

వాస్తవానికి 2021లో జనగణన చేయాల్సి ఉన్నా కోవిడ్ సాకుతో చేయలేదు. కులగణన చేయడానికి కూడా కేంద్రం ముందుకు రావడంలేదు. జనగణనే చేయనప్పుడు.. కులాల లెక్కలే తెలియనప్పుడు.. మతాల లెక్కలు తెరపైకి ఎలా వస్తాయి..? సరే.. మతాల లెక్క తేలిందనుకుందాం.. అలాంటప్పుడు కులాల లెక్కలు ఎందుకు తేలవు..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రధానమంత్రి సలహా మండలే.

Tags

Related News

Karnataka News: విప్రో క్యాంపస్ గేటు తెరవాలన్న సీఎం.. నో చెప్పిన ప్రేమ్‌జీ, అసలేం జరిగింది?

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Big Stories

×