E-Paper
Advertisement

డిసెంబర్ 1 నుంచి వారికి బాధ్యతలు.. మంత్రి సీతక్క ఆదేశాలు జారీ!

డిసెంబర్ 1 నుంచి వారికి బాధ్యతలు.. మంత్రి సీతక్క ఆదేశాలు జారీ!
Advertisement

Employment Guarantee: ‘ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలని.. అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ అటవీ ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, ఊటకుంటల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ పనుల ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. సచివాలయంలో గురువారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల పరిధిలోని వివిధ కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ..

ఉపాధి హామీ పనులు, జలసిరి, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల అమలులో రాష్ట్రంలో కూలీల హాజరు గణనీయంగా పెరుగుతోందన్నారు. నవంబర్ నెలలో రోజువారీ సగటు కూలీల హాజరు 5.97 లక్షలకు చేరిందని, నవంబర్ 18న ఒక్కరోజే 6 ల‌క్ష‌ల‌కు పైగా కూలీలు పనులకు హాజరయ్యారని, నవంబర్ సీజన్‌లో ఇది ఇప్పటివరకు అత్యధికం అన్నారు. కూలీలకు ఉపాధి కల్పించిన నేపథ్యంలో ఇదే ఒరవడిని కొనసాగించాలనిఅధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి సగటున 47 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారని, ఆ సంఖ్య‌ను 60 పెంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

డిసెంబర్ 1నుంచి బాధ్యతలు..

Advertisement

ఉపాధి కోరే ప్రతి ఒక్కరికీ పని కల్పించడంతోపాటు కూలీల సంఖ్యను మరింత పెంచేందుకు మేట్ల నియామకాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న మేట్లకు డిసెంబర్ 1నుంచి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.జలసిరి కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 88,675 పనులు ప్రారంభమయ్యాయని, 28,646 పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.ఇందులో 6,755 పంట‌కుంలు పూర్తయ్యాయి. 18 వేల ఇంకుడు గుంత‌ల ప‌నులు పూర్తయ్యాయి. 2 వేల‌కు పైగా బోరు బావుల రిచార్జ్ పనులు పూర్తి అయ్యాయి.

Also read: సిద్దిపేట జిల్లాలో.. రూ. 544.11 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం!

వీబీ–జీ రామ్ జీ..

Advertisement

మిగిలిన పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోనూ జలసిరి పనులు చేపట్టేందుకు అనుమతి ఉన్నందున సంబంధిత శాఖల సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. వీబీ–జీ రామ్ జీ కార్యక్రమం కింద గ్రామీణ నీటి వనరుల పునరుద్ధరణకు ఉన్న అవకాశాలను వినియోగించు కోవాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతోపాటు నీటి సంరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, అడిషనల్ కమిషనర్ రవీందర్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

4.70లక్షల మంది ఆరోగ్యంపై ప్రత్యేక సమావేశం

ప్రతి నెల 4 లక్షల 70 వేల మహిళా సంఘాల్లో ఆరోగ్యంపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ , సెర్ప్ సీఈఓ దివ్య ప్రత్యేక ఆరోగ్య సమావేశం (2వ ఎస్హెచ్జీ మీటింగ్)మెటీరియల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల ఆరోగ్యం పైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం అన్నారు. ఇందుకోసం 18,500 గ్రామ సంఘాలకు, 540 మండల సమాఖ్యలకు, 32 జిల్లా సమాఖ్యలకు ఆరోగ్యం, పోషణ, ఆహారం, నీరు – పారిశుద్ధ్యం వంటి 18 అంశాలపై శిక్షణ మెటీరియల్ పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు.

Also read: ఆకాశంలో ఒక తార ట్విట్టర్ రివ్యూ.. దుల్కర్ మళ్ళీ హిట్ కొట్టాడా?

Tags

Related News

షాకింగ్ న్యూస్.. మండీ బిర్యానీ తిని 9మంది ఆస్పత్రిపాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్.. త్వరలో నివేదిక!

ఏసీబీ వలలో చిక్కిన టోలీ చౌక్ సీఐ.. ఎలా పట్టుకున్నారంటే?

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బావోద్వేగం!

చంద్రబాబుకు దాసోహం.. నీటి హక్కులు తాకట్టు.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!

వాడు పోతే వీడు అంటూ.. ఛత్రపతి డైలాగ్‌తో హరీష్ రావుపై రెచ్చిపోయిన సీఎం రేవంత్!

‘మేడిగడ్డను కాంగ్రెసోళ్లే పేల్చేశారు.. ప్రాజెక్టు కొట్టుకుపోవాలని రేవంత్ కోరిక’.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు!

Big Stories

Advertisement
×