Road Safety: దేశంలో రోడ్డు ప్రమాదాలు తనకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేవారు. హైదరాబాద్ లో హెచ్ఐసీసీ వేదికగా గురువారం నిర్వహించిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సదస్సును ప్రారంభించి ఆయన మాట్లాడారు.
ఏటా రోడ్లు ప్రమాదాల్లో లక్షల మంది మరణిస్తున్నారని, వారిలో ఎక్కువ మంది యువకులే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై రోడ్లపై బ్లాక్ స్పాట్స్ కనిపించకూడదని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ స్పాట్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీర్లదేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. హైవేల నిర్మాణంలో ఇంజినీర్లు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. రోడ్ కనెక్టివిటీలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్ స్థానంలో ఉందని కొనియాడారు. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు మంచిగా ఉంటేనే భారీగా పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు.
Also Read: బతకడానికి పైసలు లేవు.. ఇష్టంలేని సినిమాలు చేస్తున్నా.. అనన్య కన్నీటి కష్టాలు!
ఇదిలాఉండగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ,, ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఏడాది సదస్సులో స్థిరమైన, వాతావరణ అనుకూల మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, మల్టీమోడల్ రవాణాతో పాటు సురక్షితమైన పాదచారుల మార్గాల కోసం చేపట్టిన ప్రత్యేక రైట్ టు వాక్ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయని తెలిపారు. 104 జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 400 స్టాళ్లతో కూడిన సాంకేతిక ప్రదర్శనలో అత్యాధునిక రహదారి ఆవిష్కరణలతో పాటు, తెలంగాణ చారిత్రక వైభవాన్ని చాటే రామప్ప ఆలయ ప్రత్యేక ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచిందని వివరించారు.
తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఇందులో రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం, హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఎన్ హెచ్-65 ఆరు లేన్ల విస్తరణ, మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, రాష్ట్ర రహదారుల అప్‌గ్రేడేషన్, రోప్‌వేలు, సీఆర్ఎఫ్ పనులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయ హరీశ్ బాబు ఆయా ప్రాంతల్లో రోడ్ల అభివృద్ధినకి అనుమతులు మంజూరు చేయాలని వినతిపత్రాలు అందజేశారు.
Also read: ఒక్క చోటే అంత బంగారమా? ఏకంగా ఏడు లక్షల కోట్లు.. లక్ అంటే వాళ్లదే!