E-Paper
Advertisement

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం.. కత్తులతో దాడి చేసి చంపేసి, సీసీటీవీ సాక్షిగా..

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం.. కత్తులతో దాడి చేసి చంపేసి, సీసీటీవీ సాక్షిగా..
Advertisement

Hyderabad City: హైదరాబాద్‌ సిటీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి ఓ వ్యక్తిని మరొక వ్యక్తి కత్తులతో పొడిచి చంపేశాడు. దాదాపు ఈ ఘటన కొన్ని నిమిషాలపాటు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఘటన ఎలా, ఎందుకు జరిగింది?

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం

పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ సిటీ ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో దారుణం జరిగింది. హరిహర మెన్‌ హాస్టల్‌లో వంట మనిషిగా పని చేస్తున్నారు 43 ఏళ్ల శశిధర్‌. ఒడిశాలోని మయూర్భంజ్‌ జిల్లా సరాధా గ్రామానికి చెందినవాడు. అదే ప్రాంతంలో శివ బాలాజీ హాస్టల్‌లో ప్రమోద్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. స్వస్థలం ఒడిషాలోని బాలేశ్వర్‌ జిల్లా బెల్గోనియా గ్రామ నివాసి.

Advertisement

మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. అయితే గురువారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఏదో విషయంపై మాటా మాటాచోటు చేసుకుంది. చివరకు అతి కాస్త గాలివానగా మారింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చడంతో ప్రమోద్‌.. తనతో తెచ్చుకున్న కత్తులతో శశిధర్‌పై దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన శశిధర్‌, స్పాట్‌లో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత వీధి రోడ్డులో మృతి చెందాడు.

కత్తులతో దాడి చేసి ఓ వ్యక్తిని చంపేసిన మరొక వ్యక్తి

అదే సమయంలో ఘటన జరిగిన ప్రాంతం నుంచి మరొక వాహనం వెళ్తుండగా ఈ సన్నివేశాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో

ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్యకు దారి తీసిన కారణాలు ఏంటి? శశిధర్‌-ప్రమోద్‌ మధ్య ఏం జరిగింది? గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

Big Stories

Advertisement
×