E-Paper
Advertisement

క్యాష్, కార్డుల టెన్షన్ వదిలేయండి.. విదేశాల్లోనూ ఇకపై PhonePeతో చిటికెలో పేమెంట్స్!

క్యాష్, కార్డుల టెన్షన్ వదిలేయండి.. విదేశాల్లోనూ ఇకపై PhonePeతో చిటికెలో పేమెంట్స్!
Advertisement

PhonePe Visa Partnership: సాధారణంగా సెలవుల్లో విదేశాలకు వెళ్లాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అయితే మన ఇండియన్స్ ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య అక్కడ డబ్బులు ఎలా చెల్లించాలి అనేది. విదేశీ కరెన్సీ మార్చుకోవడం, రూపాయి మారకం విలువ, అక్కడ ఏ కార్డు పనిచేస్తుందో అని టెన్షన్ పడటం మామూలే. కానీ, ఇప్పుడు ఆ సమస్యకు PhonePe ఒక చక్కటి పరిష్కారం చూపింది. వీసాతో చేతులు కలిపిన ఫోన్‌పే.. మన దేశం దాటి విదేశాలకు వెళ్లేవారి కోసం సరికొత్త సేవలను లాంచ్ చేసింది. ఇకపై జేబులో ఫిజికల్ కార్డు పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేకుండా, కేవలం మన స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు అన్ని పనులు చక్కబెట్టేసుకోవచ్చు.

క్యూఆర్ కోడ్ స్కాన్‌తో పేమెంట్స్:

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ప్రకటించిన ఈ కొత్త ఫీచర్ ద్వారా మన దేశ ప్రయాణికులు విదేశాల్లో క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి నేరుగా డబ్బులు చెల్లించవచ్చు. ప్రస్తుతం సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, జపాన్, చైనా సహా దాదాపు 14 దేశాల్లో ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. చిన్నపాటి షాపింగ్స్ కోసం పదే పదే క్యాష్ తీయడం లేదా కార్డు స్వైప్ చేయడం లాంటి ఇబ్బందులు ఇకపై ఉండవు.

Advertisement

Also Read: వైరల్ 1980s ఏఐ ఫొటో ట్రెండ్ వెనుక అసలు ప్రమాదం ఇదే.. ఈ యాప్స్‌తో జాగ్రత్త!

యాప్‌లోనే వీసా కార్డు సేవింగ్స్:

ఈ సదుపాయాన్ని వాడటం చాలా సులభం. ఫోన్‌పే యాప్‌లో మన దగ్గర ఉన్న అర్హత గల వీసా కార్డును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత విదేశాల్లో ఉన్నప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ అయినా, స్టోర్లలో జరిగే లావాదేవీలు అయినా నేరుగా మన ఫోన్ ద్వారానే పేమెంట్స్ పూర్తి చేయవచ్చు. అయితే అన్ని చోట్లా ఇది పనిచేస్తుందని చెప్పలేం. ఎందుకంటే.. ఆయా దేశాల్లోని మర్చంట్లు, వీసా సపోర్ట్ చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బట్టి ఇది మారుతుంటుంది.

ఆండ్రాయిడ్‌లో ట్యాప్ అండ్ పే:

Advertisement

కేవలం క్యూఆర్ కోడ్ మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫోన్‌పే ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. సపోర్ట్ చేసే ఫోన్, వీసా కార్డు ఉన్నవారు నేరుగా పీఓఎస్ టెర్మినల్స్ దగ్గర ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా సులభంగా బిల్లు చెల్లించవచ్చు. చిన్న చిన్న చెల్లింపులు తరచూ చేసేవారికి ఈ పద్ధతి చాలా సౌకర్యంగా ఉంటుంది.

చిరు వ్యాపారుల కోసం స్మార్ట్ యాప్:

కేవలం కొనుగోలుదారుల కోసమే కాకుండా.. చిన్న వ్యాపారుల సౌలభ్యం కోసం స్మార్ట్ యాప్ సేవలను కూడా ఇందులో చేర్చారు. దీంతో చిన్న బిజినెస్ చేసేవారు ఎలాంటి అదనపు మెషిన్లు లేకుండా తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే డిజిటల్ కార్డు పేమెంట్స్‌ను స్వీకరించవచ్చు. మొత్తానికి విదేశీ ప్రయాణాలను మరింత సులభం చేసే ఈ ఫీచర్ ట్రిప్స్‌ని చాలా ఈజీ చేయనుంది.

Also Read: బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

Tags

Related News

బడ్జెట్ ధరలో థియేటర్ ఫీల్, 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్

వైరల్ 1980s ఏఐ ఫొటో ట్రెండ్ వెనుక అసలు ప్రమాదం ఇదే.. ఈ యాప్స్‌తో జాగ్రత్త!

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

Big Stories

Advertisement
×