BigTV English

Aghori Srinivas: అఘోరీ గుట్టురట్టు.. వెనుకనుంచి నడిపిస్తోంది ఆ బడా నేత ఎవరో తెల్సా?

Aghori Srinivas: అఘోరీ గుట్టురట్టు.. వెనుకనుంచి నడిపిస్తోంది ఆ బడా నేత ఎవరో తెల్సా?

Aghori Srinivas: దేనికైనా ఒక హద్దు ఉంటుంది.. అతి శృతి మించితే దాని పరిణామాలు అన్నీ ఇన్నీకావు. అఘోరీ శ్రీనివాస్ విషయంలో అదే జరిగింది. తక్కువ సమయంలో బాగా పాపులర్ అయ్యాడు. చివరకు ఆయన వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అడ్డంగా బుక్కయ్యాడు.. చివరకు కటకటల పాలయ్యారు. ఇతగాడి గురించి మరో కొత్త న్యూస్. ఏంటది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాడు అఘోరీ శ్రీనివాస్‍. ఇటీవల ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ వ్యవహారమే అతడి గుట్టు బయటకు వచ్చేలా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అఘోరీ గురించి అన్నీ విషయాలు బయటకు వచ్చేలా చేసింది. అఘోరీ గురించి ఇప్పటికే పలు పోలీసుస్టేషన్‌లో రకరకాల కేసులు నమోదు అయ్యాయి. వీటిపై దృష్టి సారించారు పోలీసులు.

అఘోరీ కారు ఆ రాజకీయ నేతది


అఘోరీ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెంబర్ ప్లేట్ లేకుండా కారులో ఎలా తిరుగుతున్నాడు? దీనివెనుక ఎవరున్నారు? ఆ కారు ఎవరిది? అనేదానిపై లోగుట్టు విప్పే పనిలో పడ్డారు పోలీసులు. అందులో ఊహించని నిజాలు బయటకు వచ్చాయి. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ పేరు పేరిట కారు రిజిస్ట్రేషన్ అయ్యింది. కారు నెంబర్,TN19BU 6939.

తమిళనాడుకి చెందిన ఓ రాజకీయ పార్టీ నాయకుడు అఘోరీకి ఐ20 కారుని గిఫ్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. అఘోరీకి ఆయన ఫండింగ్ చేస్తున్నాడా? అనేదానిపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై తమిళనాడులోని ఆ నాయకుడితో ఫోన్‌లో మాట్లాడారట పోలీసులు. అఘోరీకి అండగా నిలబడి జైలు నుండి విడిపించాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ వివరాలు బయటకు వచ్చాయి. అందుకోసమే ఇన్నాళ్లు నెంబర్ ప్లేట్ లేకుండా అఘోరీ పేరుతో బోర్డు పెట్టుకుని రోడ్లపై హంగామా చేస్తున్నాడని అంటున్నారు.

ALSO READ: వీళ్లు ఎంతకైనా తెగిస్తారు.. పిచ్చెక్కి చివరకు ఇలా

సనాతన ధర్మ పరి రక్షణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో నానాహంగామా చేశాడు అఘోరీ శ్రీనివాస్. నగ్నంగా ఆలయాలను దర్శించుకున్నాడు. అతడి చేస్తున్న వ్యవహారశైలిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈలోగా ఏపీకి చెందిన వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంతో అతడి వ్యవహారం హాట్ టాఫిక్‌ అయ్యింది.

అఘోరీ జీవిత విశేషాలు

అఘోరి అసలు పేరు శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల గ్రామానికి చెందినవాడు. శ్రీనివాస్ సైకిల్ తొక్కుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. ఆపరేషన్ తర్వాత వరి బీజం తొలగించారు. ఇన్‌ఫెక్షన్ బారిన పడటంతో మర్మాంగాలు పూర్తిగా తొలగించాలని వైద్యుల సూచన. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని చెప్పడంతో ఆయన కుటుంబం భయపడింది.

ఆ సర్జరీకి లక్షల రూపాయలు పెట్టలేక ముంబై పారిపోయాడు. ఆపై హిజ్రా వేశంలో దర్శనమిచ్చాడు. అక్కడ హిజ్రాలను మోసం చేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ సమయంలో నాగ సాధు గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. నాగసాధుకి మార్కెట్ ఉందని భావించిన అఘోరీ, ఆ విధంగా తయారైపోయాడు. పూజల పేరుతో ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×