IPS Sajjanar: మధ్యతరగతి ప్రజలను బాగా ఆకట్టుకున్న ‘లక్కీ భాస్కర్’. ఆ ఉచ్చులో పడి బయటకు రాలేని పరిస్థితిలో తండ్రి సలహాతో బయటపడతాడు హీరో. రీల్ విషయంలో బాగా చూపించాడు డైరెక్టర్. రియల్ విషయానికి వద్దాం.
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి కొందరు పిచ్చోళ్లు ఇలా మానసిక రోగులుగా మారిపోతున్నారు. వారికి దూరంగా ఉండాలంటూ సలహా ఇచ్చేశారు ఐపీఎస్ అధికారి సజ్జనార్. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్దాం.
గుబులు రేపుతున్న ఐపీఎస్ అధికారి వీడియో
తెలంగాణ ఐపీఎస్ అధికారి సజ్జనార్ గురించి చెప్పనక్కర్లేదు. సమాజం బాగుంటే మనం బాగుంటామని నమ్మే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో సొసైటీలో జరుగుతున్న చెబు వ్యసనాల గురించి పదే పదే యువతను మేల్కొపుతున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.
మొన్నటికి మొన్న బెట్టింగ్ యాప్స్ కాగా, తాజాగా సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలని కొందరు యవకులు ఏ విధంగా మారుతున్నారో కళ్లకు కట్టినట్టు ఓ వీడియో బయటపెట్టారు. ఇలాంటి పిచ్చోళ్లతో జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.
సోషల్‌మీడియా పిచ్చోళ్లు
పని పాటాలేని కొందరు యువకులు నిత్యం స్మార్ట్ ఫోన్ పట్టుకుని జీవితాలను వృధా చేసుకుంటారు. ఆ సమయాన్ని చదువు ఉపయోగిస్తే మంచి విషయాలు తెలుస్తాయి. కానీ, రాత్రికి రాత్రి పాపులర్ కావాలని కోరుకుంటారు.. ఆపై ఆరాటపడతారు కూడా. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తారా!? చివరకు రీల్స్, లైక్స్ పిచ్చిలోపడి ప్రాణాలు పొగొట్టుకున్నవారు చాలానే ఉన్నారనుకోండి.
ALSO READ: చంచల్ గూడ జైలులో కాళేశ్వరం, ఈఎన్సీ హరిరామ్
ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో తెలీకుండా ఆ పిచ్చిలో పడిపోతున్నారు. డ్రగ్స్ అనేది జీవితాన్ని మాత్రమే కాదు.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.. చేస్తోంది కూడా. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
యువత భవిష్యత్‌ను చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై వీడియోలు చేస్తున్నారు కొందరు యవకులు. వాళ్లు చెప్పింది ఏమైనా సొసైటీకి ఉపయోగపడుతుందా అంటే అదీ లేదు. ఇలాంటి వాటిపై రీల్స్ చేసి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది.
సోషల్ మీడియాకు బానిసై రీల్స్ పిచ్చి పట్టిన ఇలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండాలని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. వీళ్లకి కావాల్సింది ఒక్కటే.. వ్యూస్, లైక్స్, కామెంట్స్. రాత్రికి రాత్రే పాపులర్ అయ్యేందుకు వీళ్లు ఏమైనా చేస్తారు. సమాజం ఎటు పోయినా, ఏమైనా వీళ్లకు సంబంధం ఉందని రాసుకొచ్చారు. మేలుకో యువత..!
పిచ్చి పలురకాలు.. వెర్రి వేయి రకాలు.. అంటే ఇదే!
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎంతకైనా తెగిస్తారా!? ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో కనీసం సోయి ఉండక్కర్లేదా!?
ఎంతో మంది యువత భవిష్యత్ ను చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్ పై వీడియోలు చేస్తూ.. సమాజానికి ఏం సందేశం… pic.twitter.com/BK8LBGl1JQ
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 27, 2025