BigTV English

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

Road Accident in Hyderabad: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విద్యార్థులను ఎక్కించుకొని మెదక్ జిల్లాకు బయలుదేరిన బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కాలేజ్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.


వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో బీవీ రాజు కాలేజీకి చెందిన రెండు బస్సులు పరస్పరం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. విద్యార్థులను తీసుకొని కాలేజీకి వెళ్తుండగా.. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా ముందుగా వస్తున్న అదే కాలేజీకి చెందిన బస్సును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు సుమారు అరగంటపాటు శ్రమించి క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. అలాగే, గాయపడిన విద్యార్థులతో పాటు ఇద్దరు డ్రైవర్లను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ నాగరాజుగా గుర్తించారు. ప్రస్తుతం మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.


Also Read: ఆ హోటల్‌లో గలీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. మీరు భోజనం చేశారా?

వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన తర్వాత నర్సాపూర్ – సంగారెడ్డి రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ జాం అయింది. మృతదేహం బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో చాలా సమయం పట్టింది. దీంతో నాలుగు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు కళాశాల సిబ్బంది ప్రయత్నించారు.

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×