E-Paper
Advertisement

ఏం పీక్కుంటారు అన్న కేటీఆర్ ఇప్పుడు గడగడ వణికిపోతున్నాడు!- ఆది శ్రీనివాస్

ఏం పీక్కుంటారు అన్న కేటీఆర్ ఇప్పుడు గడగడ వణికిపోతున్నాడు!- ఆది శ్రీనివాస్
Advertisement

Aadi Srinivas: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకవైపు ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’ అంటూ విర్రవీగిన ఆయన, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేటీఆర్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

గొప్పలు చెప్పి.. ఇప్పుడు కోర్టుల చుట్టూ..

Advertisement

ఏసీబీ విచారణకు వెళ్లే ముందు పెద్ద ఎత్తున షో చేసిన కేటీఆర్, ఇది కేవలం లొట్టపీసు కేసు అని కొట్టిపారేశారు. కానీ ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆది శ్రీనివాస్ నిలదీశారు. కేసులో ఎలాంటి తప్పు లేకపోతే, చట్టపరమైన విచారణను ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మధ్యలోనే పిటిషన్ల ద్వారా తప్పించుకోవాలని చూస్తే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.

రూ. 54.88 కోట్ల చెల్లింపులపై సమాధానం ఏది?

Advertisement

ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు ఎవరి అనుమతితో రూ. 54.88 కోట్లు పంపారనే కీలక అంశంపై కేటీఆర్ ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు. స్టార్ హోటళ్ల భాగోతంతో సహా అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతోనే ఆయనలో భయం మొదలైందని ఆరోపించారు.

న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉంది

తెలంగాణ ప్రజలు కేటీఆర్ ద్వంద్వ వైఖరిని గమనించాలని కోరారు. తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ విశ్వాసం ఉందని, కోర్టుల ద్వారా ఈ కుంభకోణానికి సంబంధించిన నిజాలు అన్నీ బయటకు వస్తాయని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వల.. రూ.20 లక్షల లంచం కేసులో తహశీల్దార్, సర్వేయర్ అరెస్ట్

Tags

Related News

నోటీసులు లేకుండానే ఓట్లు తొలగిస్తారా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి!- కూనంనేని

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వల.. రూ.20 లక్షల లంచం కేసులో తహశీల్దార్, సర్వేయర్ అరెస్ట్

ORRపై ఘోర ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి!

హైదరాబాద్‌లో విషాదం.. 30వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

కన్న కూతురిపై తండ్రి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్య ఏం చేసిందంటే.. సిద్ధిపేటలో దారుణం!

పిల్లలు చూస్తుండగానే.. భార్యని ఆ పని చేసిన భర్త, రంగారెడ్డి జిల్లాలో ఘటన

మరీ ఇంత అవినీతా.. రూ.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

Big Stories

Advertisement
×