Bengaluru: ఏపీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారి అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్‌లో అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, దాడికి యత్నం వంటి అంశాల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏపీలో ఆ అధికారి ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగుళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఏపీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు అయ్యింది. కావోర్ పబ్‌లో పోలీసు అధికారులపై దాడి చేసి దూషించారనే ఆరోపణలపై ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్, అతని స్నేహితులపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఐఏఎస్ వికాస్, అతని స్నేహితులు పబ్‌లో ఉన్నప్పుడు సీసీబీ పోలీసుల టీమ్ సాధారణ గస్తీ కోసం ఆ ప్రదేశానికి వచ్చింది. కొంతమంది కస్టమర్లను ప్రశ్నించారు. ఆ సమయంలో పబ్‌లో వికాస్‌తోపాటు ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. నా పేరు వికాస్ మర్మత్ అని, తాను ఐఏఎస్ అధికారి అని చెప్పారు. గుర్తింపు కార్డు చూపించాలని పోలీసులు అడిగారు.
ఈ క్రమంలో పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు వికాస్ ఫ్రెండ్ ఒకడు పోలీసు అధికారిపై చేయి వేసి ఆయనను తోసే, దాడికి యత్నించడం జరిగినట్టు తేలింది. వారిపై ఎఫ్ఐఆర్‌లో నమోదు అయ్యింది. ఈ కేసులో పోలీసులు వికాస్‌తోపాటు అతని స్నేహితులు నితేష్, అభయ్, రోషన్‌లపై కేసులు బుక్కయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్. ప్రస్తుతం కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ-KADA ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
ALSO READ: సీఎం చంద్రబాబు-సీఎం విజయ్ మధ్య కీలక అంశం అదే.. డ్లికరేషన్ మాటేంటని వైసీపీ ప్రశ్నలు
AP IAS officer Vikas Marmat, Project Director of Kuppam Area Development Authority (KADA), has been booked for allegedly misbehaving with #Bengaluru police during a late-night pub inspection at Cavour Pub on Residency Road. Kuppam is part of #AndhraPradesh CM #ChandrababuNaidu’s… pic.twitter.com/xyqqKkf9BI
— Ashish (@KP_Aashish) October 13, 2026