BigTV English

KTR – Harish Rao: ప్లాన్ రివర్స్ అడ్డంగా బుక్కైన హరీష్, కేటీఆర్

KTR – Harish Rao: ప్లాన్ రివర్స్ అడ్డంగా బుక్కైన హరీష్, కేటీఆర్

KTR – Harish Rao: అదానీ అదానీ అదానీ.. ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచమంతా ఇదే పేరు ట్రెండింగ్ అవుతోంది. ప్రాజెక్టుల కోసం లంచావతారం ఎత్తారన్న అభియోగాల చుట్టూ మ్యాటర్ తిరుగుతోంది. నేచురల్ గానే ఈ ఎపిసోడ్ తెలంగాణనూ తాకింది. కాబట్టి అభియోగాలు వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా స్కిల్ వర్శిటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద అదానీ గ్రూప్ నుంచి తీసుకోవాలనుకున్న 100 కోట్ల విరాళాన్ని తీసుకోబోమని లెటర్ రాసేసింది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని బీఆర్ఎస్ అంటోంది. గత పదేళ్లలో తాము చేసుకున్న ఒప్పందాల గురించి మాట్లాడకపోవడమే అసలు ట్విస్ట్.


తాము అనుమతులు ఇస్తే ఒకలా.. ప్రత్యర్థి పార్టీ ఇస్తే మరోలా..

చూశారుగా మ్యాటర్ ఖుల్లం ఖుల్లా. అదానీతో ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని, తెలంగాణకు అదానీ కంపెనీలతో లాభం లేదంటూ కేటీఆర్ చెప్పిన మాటలు. అంటే అధికారంలో ఉంటే ఒకలా… పోయాక మరోలా అన్న మాట. సహజంగానే అవతలి పక్షం నుంచి గట్టిగానే కౌంటర్లు పడుతాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టిగా ఇచ్చి పడేశారు. ఒప్పందాలు రద్దు ఏకపక్షంగా ఉండదని, దానికో పద్ధతి ఉంటుందని గుర్తు చేశారు. మరి తమరు అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులపై విచారణకు రెడీనా అని కూడా ప్రశ్నించారు. వీటికి నో ఆన్సర్.


అదానీ గ్రూప్ తో తెలంగాణకు నష్టమైందా? 

నిజానికి అదానీ గ్రూప్ అన్ని రాష్ట్రాల్లో విస్తరించింది. చట్ట ప్రకారం, టెండర్ల ప్రకారం అందరికీ ఒకే నిబంధనలు అమలు చేసి ఒప్పందాలు చేసుకుంటే ఎక్కడా తప్పు లేదు. దేశంలో ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి రక్షణ ఉంటుంది. సహజంగానే ఇది అదానీ గ్రూప్ కూ వర్తిస్తుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి.. తెలంగాణ మొత్తం అదానీ గ్రూప్ తో ఆగమైపోతున్నట్లు బీఆర్ఎస్ లీడర్లు పరేషాన్ అవడం, ప్రచారం చేయడం అసలు విచిత్రం. మరి గత పదేళ్లలో అదానీ గ్రూప్ ను రాష్ట్రానికి ఆహ్వానించి షేక్ హ్యాండ్లు ఇచ్చి కాఫీలు, టీలు, టిఫిన్లు చేసి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ఇదంతా ఏమైందన్న ప్రశ్నలు వస్తున్నాయి.

తెలంగాణలో అదానీ గ్రూప్ కు 12 ప్రాజెక్టులు

రైట్ ఒకసారి తెలంగాణలో అదానీ గ్రూప్ ఏయే పెట్టుబడులు పెట్టిందో చూద్దాం. మొత్తం 12 రకాల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదిస్తే అందులో పదింటికి మాత్రమే ఆమోదముద్ర పడింది. రెండింటికి ఏ ప్రభుత్వం కూడా ఓకే చెప్పలేదు. ఈ పదిట్లో ఐదు బీఆర్ఎస్, ఐదు కాంగ్రెస్ ఆమోదం తెలిపాయి. అంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టుబడుల విషయంలో సగం గులాబీ సర్కార్ అనుమతులు ఇచ్చినవే ఉన్నాయి. అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ – మామిడిపల్లి, మిసైల్ సెల్ తయారీ యూనిట్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ – ఎల్లికట్ట, అలాగే 3 నేషనల్ హైవే ప్రాజెక్టులు, 750 కేవీ ట్రాన్స్ మిషన్ లైన్ ప్రాజెక్ట్ సో ఈ ఐదింటినీ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ దగ్గరుండి అనుమతులు ఇప్పించారని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.

పాత ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటున్న బీఆర్ఎస్

ఇక డేటా సెంటర్ టెక్ పార్క్ – చందన్ వెల్లి, లాజిస్టిక్ పార్క్ అండ్ డ్రైపోర్ట్ – రామన్న పేట, పంప్ డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ రామన్నపేట, సిమెంట్ ప్లాంట్ కొడంగల్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో మ్యాటర్ ప్రజల ముందు క్లియర్ కట్ గా ఉంది. అమెరికాలో అదానీపై కేసు నమోదయ్యాక పరిస్థితులు వేగంగా మారాయి. సో బీఆర్ఎస్ మాత్రం పాత ఒప్పందాలు రద్దు చేసుకోవాలన్న డిమాండ్లు చేస్తోంది. నిజానికి అదానీ గ్రూప్ కు దేశమంతా ప్లాంట్లు, పరిశ్రమలు, పెట్టుబడులు ఉన్నాయి. అవన్నీ రద్దు చేసుకోవడం ఎక్కడైనా సాధ్యమయ్యే విషయమేనా? దేశం మొత్తానికి అదానీతో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకు ఎట్లా లాభం అవుతుందో చెప్పాలనడం, అలాంటి వ్యక్తితో వ్యాపారం చేయడం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా అన్నది కేటీఆర్ ప్రశ్న. ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్ అన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న.

పాత ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటున్న బీఆర్ఎస్ 

నిజానికి స్కిల్ ఇండియా వర్శిటీ కోసం వంద కోట్లు CSR కింద విరాళంగా ఇస్తామని అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అయితే తాజా పరిణామాలతో ఆ విరాళం వద్దని రేవంత్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు బీఆర్ఎస్ కౌంటర్లకు సీఎం ఎన్ కౌంటర్లు ఇచ్చేశారు. ఒక ఒప్పందాన్ని రద్దు చేయాలంటే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవాలి. ఏకపక్షంగా ఏది రద్దు చేసినా.. ఆ సంస్థలు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాష్ట్రంలో అదానీకి కాంట్రాక్టులు ఇచ్చింది.. భూములు కేటాయించిందీ.. అదానీతో ఫ్లైట్ ​లో ఆడంబరంగా ప్రయాణాలు చేసిందీ బీఆర్ఎస్ నేతలే అన్నారు. అదానీ పక్కన కేసీఆర్​ నిలబడి వంగి వంగి దండాలు పెట్టారంటూ ఫోటోలు చూపించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సి వస్తే.. బీఆర్​ఎస్​ వాళ్ల మీద కేసు కూడా పెట్టాల్సి వస్తదని, పదేళ్లలో చేసుకున్న ఒప్పందాలపై విచారణకు సిద్ధమా అని కేటీఆర్ ను ప్రశ్నించారు సీఎం.

Also Read: ఆ జిల్లాలలో విమానాల రయ్.. రయ్.. సీఎం రేవంత్ భేటీతో కదలిక.. కేంద్రం స్పష్టీకరణ

విచారణకు సిద్ధమా అని సీఎం ప్రశ్నలు

బీఆర్ఎస్ హయాంలో అదానీకి ప్రాజెక్టులు ఇచ్చి కమీషన్లు మెక్కి, అంటకాగిన కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయాలా అని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు సీఎం. సో ఒక మాట అనడం ఈజీ. కానీ ఆ మాట రివర్స్ లో తగిలితే జవాబు ఇచ్చుకోవడమే కష్టం. ఇప్పుడు అదానీతో ఒప్పందాలపై ప్రశ్నలు గుప్పిస్తున్న గులాబీ దళానికి తాము అధికారంలో చేసుకున్న ఒప్పందాల మ్యాటర్ మెడకు బిగుసుకుంటోంది. ఇంకా ఈ విషయంలో లోతులోకి వెళ్తే ఆ ఊబిలో ఇరుక్కునే పరిస్థితి కూడా వస్తుందన్న వాదనలున్నాయి.

రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటన్న హరీష్ రావు

అదానీతో ఒప్పందం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం అని కేటీఆర్ అంటున్నారు. ఇక హరీష్ రావు కూడా ఇంకో అడుగు ముందుకేసి.. దావోస్‌‌లో అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనతో అదానీ వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశామన్నారు. కాంగ్రెస్ మాత్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటున్నారు. సో ఇక్కడి వరకు ఒక వెర్షన్. మరి నాణేనికి రెండో వెర్షన్ కూడా ఉంటుంది కదా. బీఆర్ఎస్ హయాంలో కట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ల సంగతి ఎక్కడి వరకు వచ్చిందో రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ వ్యవహారాలపై అందులో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ కూడా జరుగుతోంది. కాలం చెల్లిన టెక్నాలజీతో పవర్ ప్లాంట్లు రాష్ట్రానికి గుదిబండగా మారాయని హస్తం నేతలు గుర్తు చేస్తున్నారు.

ఖర్చు పెట్టాక రద్దు చేయాలంటే ఆ ఖర్చు భరించేదెవరు? 

అదానీ ఇష్యూపై రాహుల్ గాంధీకి ఎదురవుతున్న ప్రశ్నలకు జవాబులు కూడా ఇచ్చారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా, పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా అందరికీ సమానమైన నిబంధనల మేరకు టెండర్లు నిర్వహించి ఎవరు రాణిస్తే వాళ్లకు కాంట్రాక్టులు, పనులు కేటాయిస్తారని, అదానీనే కాదు, అంబానీ కావొచ్చు.. టాటా, బిర్లా.. ఈ దేశంలో ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి రక్షణ ఉంటుందని ఇప్పటికే రాహుల్​ గాంధీ క్లారిఫికేషన్లు కూడా ఇచ్చారు. అయినా సరే అవే కాలం చెల్లిన విమర్శలు చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు.

నిజానికి ఒకసారి ఒప్పందం కుదిరాక రద్దు అన్నది అటు ప్రభుత్వం, ఇటు కంపెనీల మధ్య ఉండే వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. కంపెనీలు అప్పటికే పెట్టుబడులు పెట్టి ఉంటే ఆ ఖర్చంతా ఎవరు భరిస్తారు? ఉదాహరణ చూద్దాం.. బీఆర్ఎస్ హయాంలో అదానీ గ్రూప్ కు అనుమతి ఇచ్చిన మిసైల్ సెల్ తయారీ యూనిట్ నిర్మాణంలో ఉంది. అలాగే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మొదటి దశ పూర్తై.. రెండోదశకు భూమి కొనుగోలు కూడా పూర్తయింది. మరి వీటికి బీఆర్ఎస్ ఏం జవాబు ఇస్తుంది? మూడు నేషనల్ హైవేలు అదానీకి ఇస్తే రెండు పూర్తయ్యాయి. మరి వీటిని వెనక్కు తీసుకునే అవకాశం ఉంటుందా?

పెట్టుబడులు తేవాలంటూనే గులాబీ మెలికలు

పరిశ్రమల విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడుల వేటలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా దేశంలో పేరొందిన పలు ఫార్మా కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రాష్ట్రానికి దాదాపు 5,260 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు ఈనెల 22న సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సంప్రదింపులు జరిపి ఎంవోయూ కుదుర్చుకున్నారు. కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. సో పెట్టుబడులు కావాలంటారు.. వస్తే సొంత ప్రయోజనాల కోసమే తెచ్చారనడం బీఆర్ఎస్ కే చెల్లిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×