Hyderabad: ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఈ తిప్పలు పోవాలని ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఈ స్కూటర్లకు భారీగా రాయితీలు కూడా ఇస్తోంది. కేవలం స్కూటర్ లే కాకుండా బైకులు, కార్లు, ఆటోలు సైతం బ్యాటరీవి అమ్ముతున్నారు. ప్రస్తుతం వీటికి గిరాకీ కూడా ఎక్కువగానే ఉంది. తక్కువ ధరకు వస్తున్నాయని, రాయితీతో పాటూ వాతావరణ కాలుష్యం తగ్గుతుందని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు.
Also read: రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో.. విజయ్‌పాల్ అరెస్టు
అయితే అలా కొనుగోలు చేసిన చాలా మందికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒక దగ్గర బ్యాటరీ వాహనాలు పేలడం వినియోగదారులను ఆందోళన పెట్టిస్తోంది. ఇంటి మందు ఉన్న ఎలక్ట్రిక్ బైక్ దగ్దం, రోడ్డుపై వెళుతున్న ఎలక్ట్రిక్ బైక్ దగ్దం లాంటి వార్తలు తరచూ పేపర్లలో కనిపిస్తున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఏకంగా ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ దగ్దం అయింది. దీంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
బ్యాటరీ బైక్ పేలడంతో ఆ మంటలు వ్యాపించి పక్కన ఉన్న ఎనిమిది బైకులు దగ్దం అయ్యాయి. పార్కింగ్ లో రెండు ఎలక్ట్రిక్ బైకులు, ఏడు ఇతర బైకులు ఉన్నట్టు సమాచారం. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే బైకులు పూర్తిగా దర్గం అయ్యాయని తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తున్న వారిలో ఆందోళన మొదలైంది. ఇది వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిన ఘటనలు చాలానే నమోదైనప్పటికీ ఈ స్థాయిలో ప్రమాదం జరగలేదు. దీంతో మరోసారి వినియోగదారుల్లో టెన్షన్ నెలకొంది.