Gundeninda GudiGantalu Today episode November 27 th: నిన్నటి ఎపిసోడ్ లో.. బయట దీపావళి సంబరాలు ఘనంగా చేసుకుంటారు సత్యం కుటుంబం. మీనాను ప్రభావతి అంటుంటే వెనకేసుకొని వస్తాడు బాలు.. ఇక తన గురించి సపోర్టుగా మాట్లాడినందుకు బాలుకు థాంక్స్ చెప్తుంది మీనా. భూమి గుండ్రంగా ఉన్నట్లు తిరిగి తిరిగి మళ్లీ పాత విషయాలను తీస్తాడు. తాను ఎన్ని రోజులైనా క్షమించమని, తన తండ్రికి ఇచ్చిన మాట కోసమే తీసుకువచ్చానని మీనాను ఎగతాళి చేస్తాడు. ఈ విషయాన్ని బాలు నానమ్మ సుశీల గమనిస్తుంది. మీనాను ఎందుకు తిడుతున్నాంటూ బాలుని నిలదీస్తుంది. అసలు కారణం ఏంటి? చెప్పాలని బాలుని అడుగుతోంది. ఇక సుశీల అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సంక్రాంతికి మీరు రావాలి అని చెప్పి సుశీల అని వెళ్ళిపోతుంది. ఓనర్ కూతురు ఢిల్లీ నుండి వస్తుందని, ఆమెకు కారు కావాలని వారం రోజుల తర్వాత ఇస్తానని ఓనర్ చెప్పాడంటూ కవర్ చేస్తాడు బాలు.. అయితే ఇంట్లో డబ్బులు ఇవ్వవా అని అంటుంది. బాలు, మీనాను అవమానిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలుకి మీనా థాంక్స్ చెప్తుంది. కానీ, డాక్యుమెంట్స్ ఇచ్చిన విషయం తనకు చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదని మరోసారి మీనాపై బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. ఇక కారు లేకపోతే పోనిలే వాడి కాళ్ళు అయితే పట్టుకొను, ఈ ప్రపంచంలో వాడోక్కడే ఉన్నాడా? వేరే జాబ్ వెతుకుంటాను అని వెళ్లి పోతాడు. బాలు జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక రోహిణికి ఫోన్ వస్తే మౌనిక రోహిణిని పిలుస్తుంది. రోహిణికి తన బాయ్ ప్రెంఢ్ దినేష్ మరోసారి ఫోన్ చేస్తాడు. నీ విషయం ఇంట్లో వాళ్లకు తెలియలేదా? అని ప్రశ్నించాడు. తెలిస్తే.. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయే దానివిలే అంటూ.. తనకు వారం రోజుల్లోగా 50వేలు ఇవ్వాలని, మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. గతంలో ఇవ్వాల్సిన 25 వేలు ప్రస్తుతం 50 వేలు .. మొత్తం 75 వేల రూపాయలను ఇవ్వాలని, లేకపోతే.. ఈ సారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనీ, తన రహస్యం మొత్తం ఇంట్లో వారికి చెప్తానని హెచ్చరిస్తాడు దినేష్. తన దగ్గర డబ్బులు లేవని రోహిణి ఎంత చెప్పినా.. పట్టించుకోకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఇక డబ్బులు ఎలా తెచ్చి ఇవ్వాలని అనుకుంటుంది.
ఇక తనకు తెలిసిన కార్ ఏజెన్సీలకు వెళ్లి జాబ్ కోసం ప్రయత్నిస్తాడు. కానీ తాము ఇవ్వలేమంటూ తేల్చి చెప్తారు. ఎందుకని ప్రశ్నించగా.. గతంలో నువ్వు పని చేసిన వ్యక్తి దగ్గరే చాలామంది ఫైనాన్స్ తీసుకుంటారని, తనపై చేయి చేసుకున్న విషయం అందరికీ తెలుసుననీ, ఒకవేళ నీకు జాబ్ ఇస్తే.. ఇచ్చినవారికి ఎఫెక్ట్ పడుతుందని, అందుకే ఈ కారు ఏజెన్సులలో నీకెవ్వరు జాబ్ ఇవ్వరని చెబుతాడు.. ఇక బాలుకు ఎక్కడికి వెళ్లినా జాబ్ దొరకదు అని చెప్పగానే బాధ పడుతూ బయటకు వచ్చేస్తాడు. ఇక రాత్రంతా జాబ్ కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇక తన ఫ్రెండ్ జాబ్ కోసం సలహా ఇస్తాడు. సరుకులు వచ్చాయి, డబ్బులు కట్టాలని మీనాను డబ్బులు ఇవ్వమని అడుగుతుంది ప్రభావతి . ఇంతకీ బాలు డబ్బులు ఇచ్చాడా లేదంటూ నిలదీస్తోంది. బాలు ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదనీ చెబుతుంది మీనా. దీంతో ప్రభావతి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీనాపై కోపంతో రగిలిపోతుంది. డబ్బులు ఇవ్వకపోతే పరువు పోతుందని, డబ్బులు ఇవ్వకుండా మొగడు పెళ్లాలు ఇంట్లో కూర్చోని తింటారా? అని హేళన చేస్తుంది. డబ్బులు ఇస్తేనే మూడు పూటలా భోజనం పెడతానని చెబుతుంది. రోహిణీ ముందు అవమానించడం, తన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో మీనా చాలా బాధపడుతోంది..
ఇక రోహిణి ముందే ప్రభావతి అనడంతో షాక్ అవుతుంది. ఎలాగైనా డబ్బులు తీసుకురావాలని మీనా తన గాజులను తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని భావిస్తుంది. అలా తనకు తెలిసిన షాప్ దగ్గరికి వెళ్లి.. డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ, ఆ షాప్ మూసివేసే సరికి ఏం చేయాలో దిక్కు తోచదు. ఈ సమయంలో తన తమ్మునికి ఫోన్ చేస్తుంది మీనా. తాను శివాలయం దగ్గర ఉన్నాననీ, అర్జెంట్ గా రమ్మని చెబుతోంది మీనా. తన తమ్ముడు రాగానే.. తనకు అర్జెంట్ గా డబ్బులు కావాలని అడుగుతుంది. నేను ఇస్తాను అంటే వద్దు నువ్వు బుద్దిగా చదువుకో అని చెప్పింది. మరో వైపు బాలు జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో తనకు తెలిసిన వ్యక్తి కనిపించి ఏం చేస్తున్నావ్ అంటూ ఆరా తీస్తాడు. కానీ జాబ్ ఇస్తాడో లేదో చూడాలి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో జాబ్ వస్తుందేమో చూడాలి..