Amit Shah: హైదరాబాద్‌లో నేడు పాదయాత్ర అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. తెలంగాణలో మనం అధికారం లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంను మనం గద్దె దించాలని అన్నారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి, సర్దార్ పటేల్ చేసిన కృషితో నిజాం పీడా వీడిందని అమిత్ షా అన్నారు.
డిల్లీలో ఒక ర్యాలీ జరిగింది.. అది ఓటు బచావో ర్యాలీ కాదు అని.. అది చొరబాటు దారులను కాపాడడానికి జరిగిన ర్యాలీ అంటే అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము చొరబాటు దారులను తరిమికొడతాము. చొరబాటు దారులను పంపాలా వద్దా మీరే చెప్పండి అంటూ అమిత్ షా బీజేపీ శ్రేణులను అడిగారు. Sir చెయ్యాలా వద్దా చెప్పండి.. రాహుల్ జీ బోగస్ ఓట్ల ను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఎలా ఉంటాయి ఒక్కరికి ఒక్క ఓటు ఉండాలని అన్నారు.
Also Read: జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన.. దత్తత చిన్నారి వీడియో వైరల్!
బంగ్లాదేశ్ చొరబాటు దారులు మన దేశంలో ఎలా ఉంటారు. వాళ్లను పంపాలా వద్దా మీరే చెప్పండని అమిత్ షా అడిగారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో గెలిచినట్టే తెలంగాణలో కూడా మనం గెలుస్తున్నామని అన్నారు. రాహుల్ జీ మీరు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. అందులో మాత్రమే నువ్వు ప్రధాని అవుతావు బయట కావు అని.. రాహుల్ నువ్వు మూడు నెలల కు ఒక సారి విదేశీ పర్యటనకు వెళతావని కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వేదిక మీద నుండి సవాలు విసురుతున్న బయట మాట్లాడడం కాదు రాహుల్ జీ పార్లమెంట్‌లో మాట్లాడుదాం రా అంటూ సవాల్ విసిరారు. Evm మ్యానేజ్ చేస్తే కేరళ తెలంగాణ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌లో ఎలా మీ మద్దతు దారులు గెలిచారుని అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పార్టీ అంటూ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి rr ట్యాక్స్.. RR అంటే రాహుల్ ట్యాక్స్ throw రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డిల్లీకి ఏటీఎం అయ్యింది. రాహుల్ జీ ఆరు గ్యారంటీ లు ఏమయ్యాయి. ఇచ్చావు కదా ఎన్ని అమలు చేశావని అమిత్ షా ప్రశ్నించారు. రామ్ మందిరం కట్టిస్తామని చెప్పాం చెప్పినట్టుడాగా మేము కట్టించామని అన్నారు. ఆపరేషన్ సింధూరు. త్రీబుల్ తలక్ వ్యవస్థను రద్దు చేశామని అమిత్ షా అన్నారు త్వరలోనే దేశాన్ని డ్రగ్ ఫ్రీ దేశం చేస్తామని అమిత్ షా అన్నారు.
Also read: మీ ఇంట్లో భార్య,బిడ్డలు లేరా.. నెగెటివ్ ట్రోల్స్ పై ప్రియాంక ఫైర్!