BigTV English

Shamshabad Airport: సాంకేతిక లోపంతో విమానం రన్‌వేపై చక్కర్లు.. 37 మంది ఆందోళన

Shamshabad Airport: సాంకేతిక లోపంతో విమానం రన్‌వేపై చక్కర్లు.. 37 మంది ఆందోళన

Shamshabad Airport: ప్రయాణికులు గమ్యానికి చేరుకోవాలంటే విమానయానమే వేగవంతమైన మార్గం. కొన్ని గంటల్లోనే వందల కిలోమీటర్లు దాటేసి గమ్యస్థానానికి చేర్చే సౌకర్యం ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా విమానాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో తరచుగా బయటపడుతున్న సాంకేతిక లోపాలు, అత్యవసర ల్యాండింగ్స్ ప్రయాణికుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఇలాంటి ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది.


Also Read:ATM transaction: ఆర్‌బీఐ కొత్త ఏటీఎం నియమాలు.. ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే బాదుడే..

జరిగింది ఇదీ..


హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయలుదేరాల్సిన అలయన్స్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో పెద్ద కలకలం రేగింది. టేకాఫ్‌ అవుతుండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో, విమానం ఒకసారి కాకుండా మొత్తం మూడుసార్లు రన్‌వేపై చక్కర్లు కొట్టింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికుల కాసేపు ఏం జరుగుతుందో అర్థంకాలేదు. సాంకేతిక లోపం కారణంగా విమానం టేకాఫ్ చేయలేకపోతుందని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఆ సమయంలో 37 మంది ప్రయాణికులు ఉండగా, తీవ్ర ఆందోళన చెందారు. పైలట్‌ అప్రమత్తతతో వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి పెను ప్రమాదాన్ని తప్పించారు. తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఈ సంఘటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపం కారణంగా విమానం కొంతసేపు ఆలస్యం అవడంతో ఎయిర్‌పోర్టులో ఆతృత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

అయితే ఎయిర్‌లైన్స్ అధికారులు వెంటనే స్పందించి, ప్రయాణికుల భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదని నమ్మకమిచ్చారు. ఈ ఘటనపై అలయన్స్ ఎయిర్‌లైన్స్‌ అంతర్గతంగా విచారణ చేపట్టింది. ఖచ్చితమైన సాంకేతిక లోపం ఏమిటి, అది ఎందుకు వచ్చిందన్నదానిపై పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మొత్తానికి పైలట్‌ చాకచక్యమే ఈ ఘటనలో డజన్ల మంది ప్రాణాలను కాపాడింది. చిన్న తప్పిదం పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నా.. సకాలంలో గుర్తించిన అప్రమత్తతతో ఈ ప్రమాదం తప్పింది.

Related News

Rain Alert: బ్రేక్ ఇచ్చిన రెయిన్.. నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలు..

Ganesha lorry stuck: ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన గణేశుడి లారీ.. తర్వాత ఏం జరిగిందంటే..

CM Progress Report: యూరియా కొరతకు చెక్..! సీఎం ప్లాన్ ఏంటంటే..?

Revanth Reddy: బీసీల హక్కుల కోసం కట్టుబడి ఉన్నాం.. గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Gandhi Hospital: భార్యతో గొడవ… బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్… చివరికి గాంధీ వైద్యుల అద్భుతం!

Big Stories

×