BigTV English

Pushpa 2: ఇంకెంత దుడ్డు కట్టించుకుంటావ్ పుష్ప.. టికెట్ కే కాకుండా ఓటీటీకి కూడా కట్టాలా.. ?

Pushpa 2: ఇంకెంత దుడ్డు కట్టించుకుంటావ్ పుష్ప.. టికెట్ కే కాకుండా ఓటీటీకి కూడా కట్టాలా.. ?

Pushpa 2: ఎట్టకేలకు  అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పింది. ఎప్పుడెప్పుడు పుష్ప 2 ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు నెట్ ఫ్లిక్స్ తీపి కబురు చెప్పింది. అల్లు అర్జున్, రష్మిక  జంటగా సుకుమార్ దర్శకత్వంలోతెరకెక్కిన  చిత్రం పుష్ప 2. డిసెంబర్ 4 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 30 రోజుల్లో రూ. 1850 కోట్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఒక తెలుగు సినిమా అన్ని భాషల్లో ఇంత హిట్ సాధించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా సాధించని రికార్డ్ ను బన్నీ సాధించి.. తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు.


ఎన్ని కోట్లు సాధించి ఏం ప్రయోజనం. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకొనే పరిస్థితిలో బన్నీ లేడు. పుష్ప 2 బెన్ ఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు హాస్పిటల్ పాలవ్వడం జరిగింది. ఆకేసు లో బన్నీని నిందితుడిగా గుర్తించి.. పోలీసులు బన్నీ అరెస్ట్ చేశారు. ఒకటి కాదు రెండుసార్లు విచారణకు పిలిచారు. ఇక  అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో కొన్ని అబద్దాలు చెప్పుకొచ్చాడని పోలీసులు తెలిపారు. కోర్టు బన్నీకి సొంత పూచికత్తుపై బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం బన్నీ బెయిల్ పైనే బయటకు వచ్చాడు.

అల్లు అర్జున్ కేస్ ముగిసింది  కానీ.. పుష్ప 2 రికార్డ్ మాత్రం ఆగలేదు. సంక్రాంతికి.. పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ను  థియేటర్ లో రిలీజ్ చేశారు. మొదట నిడివి ఎక్కువ అవ్వడం వలన కట్ చేసిన సీన్స్ అన్ని యాడ్ చేసి.. పుష్ప రీలోడెడ్ వెర్షన్ ను రిలీజ్ చేశారు.  మొదట నుంచి చూసినవారు కూడా రీలోడెడ్ వెర్షన్ కోసం మరోసారి థియేటర్ మెట్లు  ఎక్కారు. ఇక పుష్ప 2  టికెట్ రేట్లు బాగానే పెంచిన విషయం తెల్సిందే.


NTR: హరికృష్ణ కొడుకులను దూరం పెట్టిన బాలకృష్ణ కుటుంబం.. చివరికి పేర్లు కూడా.. ?

బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లలో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 పెంచారు.అప్పట్లో ఇది చాలా పెద్ద విషయం.  ఈ రేంజ్ టికెట్ ధరలు అంటే చాలా కష్టం అనుకున్నారు. కానీ, అభిమానులు వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా పుష్ప 2 థియేటర్లను నింపేశారు. ఇక ఇక్కడితో ఆగిపోయింది అనుకుంటే.. ఇంకా పుష్ప 2  ప్రేక్షకుల నుంచి డబ్బులు లాగాలనే చూస్తోంది.

టికెట్ రేటు ఎక్కువ ఉండడంతో.. కొంతమంది ఓటీటీలోకి వచ్చాకా సినిమా  చూడాలని ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మూడువారాల తరువాత ఏ సినిమా అయినా ఓటీటీ బాట పడుతుంది. కానీ, పుష్ప మాత్రం ఇంకా ఓటీటీ డేట్ ను కూడా ఫిక్స్ చేయలేదు. ఇప్పుడప్పుడే పుష్ప 2 .. ఓటీటీకి రాదని మేకర్స్ క్లారిటీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక దాదాపు రెండు నెలల తరువాత పుష్ప ఓటీటీ బాట పట్టింది.  తాజాగా నెట్ ఫ్లిక్స్.. పుష్ప 2 ఓటీటీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. కానీ, డేట్ మాత్రం చెప్పలేదు. ఓటీటీలో కూడా రీలోడెడ్ వెర్షన్ తోనే స్ట్రీమింగ్ కానున్నట్లు ట్రైలర్ ను బట్టే తెలుస్తోంది.

ఇక ఇక్కడ కూడా నెట్ ఫ్లిక్స్ కండిషన్ పెట్టింది. పుష్ప 2 చూడాలంటే రూ.199 కట్టి చూడాలని చెప్పుకొచ్చింది. రెంట్ పద్దతిలో పుష్ప 2 చూడొచ్చు అని చెప్పుకొచ్చింది. అంటే సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా పైన ఇంకో రూ .199 కట్టి  సినిమా  చూడాలన్నమాట. దీంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. టికెట్ కొనడానికే ఎక్కువ పెట్టాం.. ఇప్పుడు మళ్లీ ఓటీటీలో చూడాలంటే ఇంకా డబ్బులు కట్టాలా.. దారుణం అని కొందరు అంటుండగా.. ఇంకెంత దుడ్డు కట్టించుకుంటావ్ పుష్ప.. టికెట్ కే కాకుండా ఓటీటీకి కూడా కట్టాలా.. ? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రెంట్ పద్దతిలో కాకుండా ఫ్రీగా పుష్ప 2 ను చూసే రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×