BigTV English

TS Loksabha Elections : ఎంప్లాయిస్‌కు వేతనంతో కూడిన సెలవు.. లేకపోతే చర్యలు : సీఈఓ వికాస్ రాజ్

TS Loksabha Elections : ఎంప్లాయిస్‌కు వేతనంతో కూడిన సెలవు.. లేకపోతే చర్యలు : సీఈఓ వికాస్ రాజ్

CEO Vikas Raj Press Meet Points : ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తోంది. రెండ్రోజుల్లో నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని, టీవీ ఛానల్స్, వెబ్ సైట్స్, ఇంటర్నెట్ ప్లాట్ ఫామ్స్.. ఇలా ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.


మే 13 పోలింగ్ రోజున అన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ఎన్నికలకు 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లను వాడామన్నారు. హోం ఓటింగ్, సర్వీస్ ఓటింగ్ ముగిసిందని తెలిపారు. హోం ఓటింగ్ తో 21,680 మంది వేయగా.. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. 1,88,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు తెలిపారు. ఇంకా ఎన్ని పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయో పూర్తిగా లెక్కించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 90 వేల మంది ఎన్నికల విధులలో ఉంటారని, 34,973 మంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకుని ఓటు వేస్తారని వివరించారు.

ఇక.. ఏ పార్టీ తరఫున ప్రకటన ఇవ్వాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవాలంటే 1950 నంబర్ కు స్లిప్ పై ఉన్న నంబర్ ఎస్ఎంఎస్ చేస్తే పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ మొబైల్స్ కు వస్తాయని తెలిపారు. వేసవి దృష్ట్యా పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. పోలింగ్ బూత్ లలో డ్రింకింగ్ వాటర్, ఫ్యాన్లు, కూలర్లు పెట్టాలని బూత్ నిర్వాహకులకు సూచించామని, పారామెడికల్ సిబ్బంది మెడిసిన్ తో అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ చేసిన తనిఖీలలో రూ.350 కోట్ల నగదును సీజ్ చేసినట్లు వెల్లడించారు.


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×