E-Paper
Advertisement

మారని హెచ్‌సీఏ తీరు.. క్రికెట్ బోర్డులో మళ్లీ మొదలైన కాసుల వేట..!

మారని హెచ్‌సీఏ తీరు.. క్రికెట్ బోర్డులో మళ్లీ మొదలైన కాసుల వేట..!
Advertisement

HCA Controversy: స్వేచ్చ బ్యూరో: కేసులు.. అరెస్టులు.. కొనసాగుతున్న విచారణలు. అయినా, హైదరాబాద్ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్​సీఏ) తీరు మాత్రం మారటం లేదు. క్రికెట్​ అభివృద్ధి కోసం పని చేయాల్సిన అసోసియేషన్​ సభ్యులు కొందరు దానిని గాలికొదిలేసి కాసుల వేటకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు..బీసీసీఐ రాజ్యాంగంలోని నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండా టీజీ20 పేర టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతూ వందలాది మంది యువ క్రికెటర్ల భవిష్యత్తుతో చెలగాటాలాడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఉన్న సమయంలో హెచ్​సీఏలో చక్రం తిప్పిన కొందరు ఇప్పటికీ అదే పని చేస్తుండటం.

ఆడిట్​ రిపోర్టులు ఏవీ..?

క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ ఏటా వంద కోట్ల రూపాయలకు పైగానే నిధులను హెచ్​సీఏకు సమకూరుస్తూ వస్తోంది. వీటితో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రికెట్​ ను అభివృద్ధి చేయాలి. దీని కోసం మౌళిక వసతులు కల్పించాలి. యువ క్రికెటర్లలోని ప్రతిభను వెలి తీసేందుకు టోర్నమెంట్లు జరపాలి. అయితే, దశాబ్ధాలుగా హైదరాబాద్ జిల్లాకే పరిమితమైన హెచ్​సీఏ జిల్లాల్లో క్రికెట్​ అభివృద్ధి కోసం చేసింది శూన్యమే అని చెప్పాలి. జిల్లాల స్థాయిలో ఇప్పటివరకు ఏ ఒక్క టోర్నీని కూడా జరపలేదు. అయితే, రికార్డుల్లో మాత్రం క్రికెట్​ అభివృద్ధి కోసం అంత ఖర్చే చేశాం..ఇంత ఖర్చు చేశామంటూ కొందరు పెద్దలు నిధులను స్వాహా చేసినట్టుగా ఆరోపణలున్నాయి. బీసీసీఐ ఇచ్చిన నిధులకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క ఏడాది కూడా ఆడిట్​ వివరాలను హెచ్​సీఏ బయట పెట్టకపోవటం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఇక, సీఐడీ, ఈడీలో నమోదైన కేసుల్లో జరిపిన విచారణలో హెచ్​సీఏలోని కొందరు క్రికెట్​ బాళ్లు మొదలుకుని ఉప్పల్​ స్టేడియంలో పెట్టించిన బకెట్ సీట్లు, జిమ్​ పరికరాలు ఇలా ప్రతీదాంట్లో లక్షల రూపాయలు కమీషన్లుగా తీసుకున్నట్టుగా నిర్ధారణ కావటం గమనార్హం. ఈ క్రమంలో కొంతమంది అరెస్టులు కూడా అయ్యారు.

అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో..

Advertisement

ఇక, హెచ్​సీఏకు గతంలో అధ్యక్షునిగా పని చేసిన జగన్మోహన్​ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే. మాజీ మంత్రి కృష్ణాయాదవ్​ కు చెంది గౌలిపురాలో ఉన్న శ్రీచక్ర క్రికెట్​ క్లబ్ సభ్యున్ని అంటూ ఫోర్జరీ సంతకాలు సృష్టించి ఏకంగా హెచ్సీఏ అధ్యక్షునిగా ఎన్నియ్యాడు. అది కూడా ఒకే ఒక్క ఓటు తేడాతో. అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోని కొందరు కీలక నేతల అండదండలతోనే జగన్మోహన్​ రావు ఇష్టారాజ్యంగా వ్యవహరించి పెద్ద ఎత్తున హెచ్సీఏ నిధులను పక్కదారి పట్టించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరిగినా హెచ్​సీఏలో ఇప్పటికీ ఉన్న కొందరి వ్యవహారంలో మాత్రం మార్పు రాలేదు. జగన్మోహన్​ రావు అరెస్ట్ తో ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని జనరల్​ బాడీ మీటింగ్​ నిర్వహించి ఎన్నికలు జరిపి భర్తీ చేయాలి. అలా కాకుండా తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని హెచ్​సీఏ అధ్యక్ష స్థానానికి నామినేట్​ చేసి నియమించారు.

Also Read: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. టెంపుల్స్‌లో వీఐపీ దర్శనాలెందుకు? దేవుడి ముందు అందరూ సమానమే

టీజీ20 టోర్నీ పేరుతో..

Advertisement

తాజాగా టీజీ20 టోర్నీ పేరుతో భారీ మొత్తంలో డబ్బు దండుకోవటానికి హెచ్సీఏ ప్రయత్నిస్తున్నట్టుగా బలమైన ఆరోపణలు వస్తున్నాయి. దశాబ్దాలుగా హైదరాబాద్ జిల్లాకే పరిమితమై మిగితా జిల్లాలను పట్టించుకోని హెచ్​సీఏ ఈ టోర్నీ పేరుతో రాష్ట్ర క్రికెట్​ ను మొత్తం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఇప్పటికే తెలంగాణ క్రికెట్​ అసోసియేషన్​ (టీసీఏ) తెలిపింది. దీనిపై అవసరమైతే న్యాయస్థానాలకు వెళతామని కూడా స్పష్టం చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఏదైనా టోర్నీని నిర్వహించాలంటే బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్స్​ 28, 3‌‌0 ప్రకారం బీసీసీఐ అనుమతి తప్పనిసరి. పర్మిషన్​ తీసుకునే టోర్నీ జరుపుతున్నామని హెచ్సీఏ చెబుతోంది. అయితే, బీసీసీఐ ఇచ్చిన అనుమతిని చూపించమంటే మాత్రం పెదవి విప్పటం లేదు. ఇలా అనుమతి లేకుండా నిర్వహించే టోర్నీల్లో పాల్గొనే యువ క్రికెటర్ల భవిష్యత్తు పూర్తిగా అంధకారం అవుతుందని టీసీఏ చెబుతోంది. బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్​ 31 ప్రకారం అనుమతి లేని టోర్నీల్లో పాల్గొనే యువ క్రికెటర్లకు భవిష్యత్తులో బీసీసీఐ నిర్వహించే అన్ని పోటీల్లో నిషేధిస్తారని పేర్కొంది.

చక్రం తిప్పిన బీఆర్​ఎస్..

అయినా, హెచ్సీఏలోని కొందరు డబ్బు కొల్లగొట్టేందుకు టోర్నీని జరపటానికి సిద్ధమై యువ క్రికెటర్ల భవిష్యత్తుతో చెలగాటాలాడుతున్నారన్నారు. పైగా, కోర్టులు ఇచ్చిన ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. ఇంత ధైర్యంగా వీళ్లు వ్యవహరిస్తుండటానికి కారణం గతంలో హెచ్​సీఏలో చక్రం తిప్పిన బీఆర్​ఎస్​ లోని కొందరు నాయకుల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుండటమే అని ఆరోపించారు. క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరారు. ఇన్నేళ్లుగా హెచ్సీఏకు బీసీసీఐ నుంచి వచ్చిన వందలాది కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి? జిల్లాల్లో క్రికెట్​ అభివృద్ధికి చేసింది ఏమిటి? అన్న అంశాలపై సమీక్షా సమావేశాన్ని జరిపితే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.

Also Read: వీటితో తక్కువ బడ్జెట్‌లో.. మీ ఇంటికి 24 గంటల సేఫ్టీ

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×