BigTV English
Advertisement

Allu Arjun for BRS : పొలిటికల్ అల్లుడు!.. మామ కోసం అర్జున్ ఎంట్రీ!?

Allu Arjun for BRS : పొలిటికల్ అల్లుడు!.. మామ కోసం అర్జున్ ఎంట్రీ!?
Allu Arjun for BRS party

Allu Arjun visit to Nalgonda(Telangana news today):

రాజకీయాలు, సినిమాలది విడదీయరాని అనుబంధం. ఎన్నికల ప్రచారంలో సినీతారలు, సినిమాల ప్రచారంలో రాజకీయ నేతలు పాల్గొంటూ సందడి చేయడం కొత్త కాదు. ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్‌ ఎక్కువగానే ఉంది. కానీ… తెలంగాణ రాజకీయాల్లో సినిమా రంగానికి చెందిన వాళ్లు లేరు. కానీ.. ఇప్పుడు కొత్తగా ఓ స్టార్‌ హీరో తెలంగాణ పాలిటిక్స్‌లో సందడి చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.


అతనెవరో కాదు.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. అవును.. అల్లు అర్జున్‌ ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు కానీ.. అతడిని మా వాడే అని చెప్పుకుంటూ బన్నీ స్టార్‌ ఇమేజ్‌ను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ లీడర్లు ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనం.

అల్లు అర్జున్ నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్‌ లీడర్‌ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి కూతురు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి నాగార్జున సాగర్ టికెట్‌పై కన్నేశారు. ఇప్పుడు అల్లుడు అర్జున్‌ స్టార్‌ ఇమేజ్‌ను తన ప్రచారానికి వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్‌ లీడర్లు కూడా అర్జున్‌ తమ వాడే అని చెప్పుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.


నల్గొండ జిల్లాలో అల్లు అర్జున్‌ పర్యటన ఆసక్తిగా మారింది. చింతపల్లి స్టేజ్ వద్ద అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన కంచర్ల కన్వెన్షన్‌ను అల్లు అర్జున్‌ ప్రారంభించారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు… అల్లు అర్జున్‌ యాత్రకు రాజకీయ ప్రాధాన్యత కూడా నెలకొంది. అర్జున్‌ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చూస్తే.. పొలిటికల్‌ టూర్‌ను తలపించాయి. కంచర్ల చంద్రశేఖర్, అల్లు అర్జున్‌, మినిస్టర్లు కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

చంద్రశేఖర్‌రెడ్డి వ్యవసాయ కేంద్రంలో నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను తన అల్లుడు అల్లు అర్జున్‌తో ఓపెన్ చేయించడం ద్వారా బల నిరూపణ చేశారని అంటున్నారు. పెద్దఎత్తున పార్టీ లీడర్లు, నియోజకవర్గానికి చెందిన 10వేల మంది హాజరయ్యారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, అల్లు అర్జున్‌ కటౌట్లు పెట్టారు. కన్వెన్షన్‌ ఓపెనింగ్‌కు భారీగా ప్రజల్ని ఆహ్వానించి ఆత్మీయ సమ్మేళనంలా నిర్వహించారు. గత ఎన్నికల్లో మామ తరఫున అల్లుడు అర్జున్ ప్రచారం చేసినా ఓటమి తప్పలేదు. ఈసారి కూడా టికెట్ వస్తే.. మామను గెలిపించేందుకు బన్ని గట్టి ప్రయత్నమే చేస్తారని అంటున్నారు. ప్రస్తుత ఈవెంట్ జస్ట్ టీజర్ మాత్రమేనని.. ముందుముందు అసలైన పొలిటికల్ సినిమా చూపిస్తారని చెబుతున్నారు.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

Big Stories

×