E-Paper
Advertisement

పెట్రోల్, డీజిల్ కాదు.. కంప్లీట్ ఎలక్ట్రిక్ డిఫెండర్ వచ్చేస్తోంది!

పెట్రోల్, డీజిల్ కాదు.. కంప్లీట్ ఎలక్ట్రిక్ డిఫెండర్ వచ్చేస్తోంది!
Advertisement

JLR Baby Defender EV: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తన డిఫెండర్ లైనప్‌ ను మరింత విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్‌ తో కొత్త బేబీ డిఫెండర్‌ ను తీసుకురానుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉత్పత్తి 2027లో ప్రారంభం కానుందని JLR సీఈఓ పీబీ బాలాజీ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

2027లో ఉత్పత్తి ప్రారంభం

కొత్త ఎస్‌యూవీకి సంబంధించి ప్రొడక్షన్ ప్రారంభం అవుతున్నట్లు వెల్లడించినా,  అధికారిక పేరును మాత్రం వెల్లడించలేదు. యూకేలోని మెర్సీసైడ్ ప్రాంతంలో ఉన్న హేల్‌ వుడ్ ప్లాంట్‌ లో దీని తయారీ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇదే ప్లాంట్‌లో రేంజ్ రోవర్ ఎవోక్, డిస్కవరీ స్పోర్ట్ మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. బేబీ డిఫెండర్‌తో పాటు కొత్త రేంజ్ రోవర్ జీటీ తయారీ కూడా 2027లో ప్రారంభమవుతుందని బాలాజీ తెలిపారు.

డిఫెండర్ 90 కంటే చిన్నగా..

Advertisement

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిఫెండర్ 90, 110, 130 మోడళ్ల కంటే ఈ కొత్త ఎస్‌యూవీ చిన్నదిగా ఉండనుంది. దీని పొడవు 4.5 మీటర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా. దీనికి ఫోర్ వీల్ డ్రైవ్ సదుపాయం ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్‌కు ‘డిఫెండర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్’ లేదంటే ‘డిఫెండర్ 80’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే, సంస్థ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డిఫెండర్ బ్రాండ్ స్వతంత్ర బ్రాండ్‌గా మారిన తర్వాత వస్తున్న తొలి సరికొత్త మోడల్ ఇదే కావడం విశేషం.

EMA ప్లాట్‌ఫామ్‌పై నిర్మాణం

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని JLRకు చెందిన ఎలక్ట్రిక్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌ను భవిష్యత్తులో రానున్న రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ జీటీ కోసం కూడా ఉపయోగించనున్నారు. బ్యాటరీ, మోటార్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం కావడంతో పాటు ఫోర్-వీల్ డ్రైవ్‌ తో వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్‌కు హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు కొనసాగుతున్నాయని బాలాజీ తెలిపారు. అయితే, హైబ్రిడ్ మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు విడుదలయ్యే అవకాశం లేదు.

ఆఫ్‌రోడ్ కెపాసిటీ ఎలా ఉంటుంది?

Advertisement

డిఫెండర్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు దాని ఆఫ్‌రోడ్ సామర్థ్యం. కొత్త బేబీ డిఫెండర్‌ లోనూ ఇదే పద్దతిని కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అయితే, ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్, వాహనం అడుగుభాగంలో అమర్చే బ్యాటరీ కారణంగా వీల్ ట్రావెల్, సస్పెన్షన్ కదలికల విషయంలో కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి చిన్న పరిమాణంలో ఎలక్ట్రిక్ డిఫెండర్‌ ను కోరుకునే వారికి ఈ కొత్త మోడల్ బెస్ట్ ఆప్షన్ గా మారే అవకాశం ఉంది.

Read Also: Kia Syros EV Range: కంపెనీ చెప్పేది 526 కి.మీ.. రియల్ టెస్ట్‌ లో వచ్చింది ఎంతంటే?

Tags

Related News

ఇండియాలోకి నార్టన్ న్యూ బైక్.. 585cc ఇంజిన్‌తో రాబోతున్నఅట్లాస్!

Kia Syros EV Range: కంపెనీ చెప్పేది 526 కి.మీ.. రియల్ టెస్ట్‌ లో వచ్చింది ఎంతంటే?

వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. ఇప్పుడు ఎంత అంటే?

కారు కీని గుర్తించడం లేదా? బ్యాటరీ అయిపోయినా ఇలా స్టార్ట్ చేయొచ్చు!

LFP vs NMC బ్యాటరీలు.. ఇండియన్ ఈవీలకు ఏది బెస్ట్? అసలు తేడాలు ఇవే!

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

కారు సన్‌రూఫ్ నుంచి నీళ్లు కారుతున్నాయా? వేలల్లో నష్టాన్ని తప్పించుకోండిలా!

Big Stories

Advertisement
×