Amit Shah Fires on Revanth comments(TS politics): పదేళ్ల ఎన్డీఏ పాలనలో ఉగ్రవాదాన్ని అంతం చేశామని, ప్రధాని మోదీపై ఇంతవరకూ ఒక్క అవినీతి మరక కూడా లేదని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. శనివారం వికారాబాద్ లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభకు ఆయన హాజరయ్యారు. జరగబోయే ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ఓటేయాలని హితవు పలికారు. ఒకరు ఉగ్రవాదాన్ని అంతం చేస్తే.. మరొకరు ఉగ్రవాదానికి రక్షణ ఇచ్చేవారని మోదీ, రాహుల్ లో ఎవరు ప్రధాని కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. బీజేపీకి ఓటేస్తే.. తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తామన్నారు.
మోదీ దీపావళి రోజు కూడా సెలవు లేకుండా పనిచేశారని, కాస్త వేడి పెరిగితే రాహుల్ టూర్ కు వెళ్లిపోయారని యద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ తో తీవ్రవాదాన్ని మట్టుపెట్టామని బీజేపీ చెబుతుంటే.. రేవంత్ రెడ్డి దానిపై వెటకారంగా మాట్లాడటం తగదన్నారు. కాంగ్రెస్ కు సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం లేదని, ఇలాంటివి బీజేపీతో మాత్రమే సాధ్యమని తెలిపారు. ABC అంటే.. A- అసదుద్దీన్, B-బీఆర్ఎస్, C – కాంగ్రెస్ అని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మళ్లీ పాతపాటే అందుకున్నారు అమిత్ షా. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారని పేర్కొన్నారు.
Also Read : కేసీఆర్ ధన దాహానికి పాలమూరు బలైంది: సీఎం రేవంత్
పాకిస్థాన్ వద్ద ఆటమ్ బాంబ్ ఉందని కాంగ్రెస్ నేత మణిశంకర్ చెబుతున్నారని, దానికి భయపడి పీఓకేను పాకిస్థాన్ ను అప్పగించలేమన్నారు. బీజేపీ ఉన్నంత వరకూ పీఓకేను పాకిస్థాన్ కు అప్పగించే ప్రసక్తే లేదన్నారు. కశ్మీర్ మనదో కాదో తెలంగాణ ప్రజలే చెప్పాలని అడిగారు. బీజేపీకి ఓటు వేసి.. మళ్లీ మోదీనే ప్రధానిని చేయాలని, మోదీతోనే దేశ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.