BigTV English

MIM Asaduddin Vs BJP Navneet Rana: నవనీత్‌కు అసదుద్దీన్ కౌంటర్.. ఎనీ ప్లేస్ రెడీ అంటూ..

MIM Asaduddin Vs BJP Navneet Rana: నవనీత్‌కు అసదుద్దీన్ కౌంటర్.. ఎనీ ప్లేస్ రెడీ అంటూ..

MIM Asaduddin Vs BJP Navneet Rana: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ఎంఐఎం పార్టీ బీజేపీని టార్గెట్ చేయడం, దానికి కమలనాథులు కౌంటరివ్వడం చకచకా జరిగింది. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్‌కు షాకవ్వడం బీజేపీ నేతల వంతైంది.


తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ నేత నవనీత్‌రాణా.. ఎంఐఎం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ రియాక్టయ్యారు.  15 సెకన్లు కాదు.. గంట సమయం ఇస్తామన్నారు. ముస్లింలను ఏం చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు. టైమ్, ప్లేస్ చెబితే ఎక్కడికైనా వస్తామన్నారు. అయినా అధికారమంతా బీజేపీ దగ్గరే ఉందన్నారు.

ఇదిలావుండగా నవనీత్ రానా చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది ముమ్మాటికీ ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆ పార్టీ తెలిపింది. అసలేం జరిగిందంటే.. బీజేపీని 15 నిమిషాల్లో తరిమికొడతామంటూ గతంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత నవనీత్ రానా కౌంటరిచ్చారు. 15 నిమిషాలు కాదు… కేవలం 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో… మళ్లీ ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదంటూ వ్యాఖ్యానించారు.


Also Read: ఓవరాక్షన్ చేయొద్దు: మంత్రి సీతక్క

నవనీత్ కామెంట్స్‌పై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ కామెంట్స్ తమకు వర్కవుట్ అవుతుందని ఇటు బీజేపీ, అటు ఎంఐఎం లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ తరహా కామెంట్లు ఎన్నికల ముందు  హైదరాబాద్‌లో సహజంగా ఉంటాయి. కాకపోతే ఎంఐఎం గతంలో చేసిన వ్యాఖ్యలకు స్థానిక నేతలు కాకుండా బయట నుంచి వచ్చిన నవనీత్ కామెంట్స్ చేయడం హాట్ హాట్‌గా మారింది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×