Big Stories

Amit Shah Fake Video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో న్యూట్విస్ట్.. ముగ్గురు అరెస్ట్..!

3 People Arrested on Amit Shah Deep Fake Video Case: కేంద్రమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్‌తోపాటు నవీన్, విష్ణు, వంశీ, గీత, తస్లీమాను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ పోలీసులు వాళ్లని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు.

- Advertisement -

మరోవైపు అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసు విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. నేరుగా గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు సీఐ రామ్‌నివాస్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు  వచ్చారు. లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ రామచంద్రారెడ్డి కోసం ఆరా తీశారు. ఆయన లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఢిల్లీ పోలీసులు. గాంధీభవన్‌కు ఎందుకు వచ్చారని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు బేగంబజార్ పీఎస్ ఆఫీసర్ విజయ్‌కుమార్. అడ్వకేట్ రామచంద్రారెడ్డితో మాట్లాడాలని సమాధానం ఇచ్చారు. ఐదు నిమిషాల్లో తిరిగి వెళ్లిపోయారు. మరోసారి నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

మరోవైపు ఢిల్లీ పోలీసులు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్‌కు సమన్లు పంపారు. గురువారం విచారణకు హాజరుకావాలని అందులో ప్రస్తావించారు. ఢిల్లీ పోలీసులు తనకు నోటీసు ఎందుకు ఇచ్చారో అర్థంకావడం లేదన్నారు. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరిన తరుణంలో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమిత్ షా రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారంటూ ఏప్రిల్ 28న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Amethi: ఇంతకు ఎవరీయన..? అమేథీ టికెట్‌ను అధిష్టానం ఈయనకే ఎందుకు ప్రత్యేకంగా ఇచ్చింది..??

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News