E-Paper
Advertisement

టీచర్లను కింద కూర్చోబెట్టిన పెద్ద మేడమ్స్.. వలిగొండ మండలంలో దారుణం..!

టీచర్లను కింద కూర్చోబెట్టిన పెద్ద మేడమ్స్.. వలిగొండ మండలంలో దారుణం..!
Advertisement

Anganwadi Controversy: స్వేచ్ఛ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా వలిగొండ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం వెయ్యి రోజుల ప్రాముఖ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ వెంకటరమణ హాజరవ్వగా కార్యక్రమంలో సూపర్వైజర్లు గోదా ధనమ్మ, పారిజాత బలమని పాల్గొన్నారు. తల్లులు, గర్భిణీలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లను కింద కూర్చోబెట్టి సిడిపిఓ,సూపర్వైజర్ వారి ఎదుట కుర్చీలపై కూర్చొని కార్యక్రమాన్ని నిర్వహించారు. మేము మీకంటే స్థాయిలో ఎక్కువ అనే విధంగా వారు ప్రవర్తించిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.. ఈ తరహా గతంలో ఇది మొదటిసారి ఏమీ కాదని తరచూ ప్రతి నెల జరిగే మీటింగ్ లోను అంగన్వాడీ టీచర్లను నేలపైనే కూర్చోబెట్టే మీటింగ్లో నిర్వహిస్తూ ఉంటారని తెలుస్తోంది.. అంగన్వాడీ టీచర్లను వారి పై స్థాయి అధికారులు ఈ విధంగా చూడడం పరిపాటిగా మారిద్దని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Also read: గాంధీభవన్‌ను షేక్ చేస్తున్న పైరవీల చిట్టా.. ఉద్యోగాల పేరిట భారీ మోసం..!

అది సరైన పద్ధతి కాదు: అధికారి నరసింహారావు

Advertisement

వలిగొండ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి టీచర్లను కింద కూర్చోబెట్టి సిడిపిఓ సూపర్వైజర్లు కుర్చీలపై కూర్చోవడం అనేది సరైన పద్ధతి కాదు.. ఎవరి గ్రేడ్ వారికి ఉంటుంది ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం మంచి పద్ధతి.. ఇలాంటివి మరొకసారి జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.

తారతమ్యం లేకుండా చూడాలి: కొడారి వెంకటేష్

అంగన్వాడీ సూపర్వైజర్లు, సీడీపీఓ లు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో అంగన్వాడీ టీచర్లు నిలబడి లేదా కూర్చుని పిల్లలతో ఆక్టివిటీస్ చేయిస్తారు. కానీ ఏదైనా సమావేశం జరిగినప్పుడు మాత్రం తప్పకుండా అధికారులతో పాటు అంగన్వాడీ టీచర్లు కూడా అధికారులతో పాటు కుర్చీలోనే కూర్చోవాలి. ఎందుకంటే గ్రామస్తుల ముందు అంగన్వాడీ టీచర్లు తక్కువ స్థాయి అనే ఆలోచన కలిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

Advertisement

Also Read: ఢిల్లీ పీఠాన్ని శాసిస్తున్న ప్రాంతీయ శక్తులు.. కింగ్ మేకర్ల చేతిలో జాతీయ పార్టీల జాతకం!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×