BigTV English

YS Sharmila: రేవంత్ అన్నకి హృదయ పూర్వక అభినందనలు: వైఎస్ షర్మిల

YS Sharmila: రేవంత్ అన్నకి హృదయ పూర్వక అభినందనలు: వైఎస్ షర్మిల

YS Sharmila: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదే విధంగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఘనంగా చేపట్టనున్నారు. విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నిండైన రూపంతో కనిపిస్తోంది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. పాదపీటంపై ఉద్యమ చిహ్నంగా పిడికిళ్లు కనిపిస్తున్నాయి.


తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు తెలంగాణ మంత్రులు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ సలహాదారుల వేణుగోపాల్ కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. ప్రజా పాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాలని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవాలని కోరారు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిసి వేడుకల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం ఆహ్వానించారు.

Also Read: ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి పొన్నం, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానం


ఈ తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు వైఎస్ షర్మిల. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, సంక్షేమ, అభివృద్ధి రాజ్యంగా, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయం అన్నారు. కాంగ్రెస్ తోనే రాష్ట్రాల అభివృద్ధి. హస్తమే దేశానికి అభయహస్తం అని తన ఎక్స్ లో ట్వీట్ చేశారు.

కాగా వైఎస్ షర్మిల మరో ట్వీట్‌లో మాజీ మంత్రి జగన్ ను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై APCC చీఫ్‌ వైఎస్ షర్మిల స్పందించారు. విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషమంటూ ఆమె ట్వీట్ చేశారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన 17వందల 50 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడని షర్మిల ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారనీ ఆమె ప్రశ్నించారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా అన్న షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా అని ప్రశ్నించారు. మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారంటూ షర్మిల ప్రశ్నించారు.

TDP ప్రతిపక్షంలో ఉండగా.. సెకీతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని..టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. గుజరాత్ లో రూపాయి 99 పైసలు దొరికే సోలార్ విద్యుత్‌ను. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయల 49 పైసలకు ఎలా కొన్నారని ప్రశ్నించారు.

Related News

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Necklace Road Flyover: 8 నిమిషాల్లో బేగంపేట?.. నక్లెస్ రోడ్ పై కొత్త ఫ్లైఓవర్ స్కెచ్ ఇదే!

CM Revanth Reddy: ముందు చట్టం తెలుసుకో.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్

Telangana Rains: మరో 2 గంటల్లో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో తస్మాత్ జాగ్రత్త!

Kova Lakshmi: కాంగ్రెస్ నేతను వాటర్ బాటిల్ తో కొట్టిన BRS ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

Big Stories

×