Jhansi Junction Railway Station: యూపీలో ఒళ్లు జలదరించే సంఘనట జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆగి ఉన్న రైలు ఇంజిన్ మీదికి దూకాడు. అదే సమయంలో రైలు మీద ఉన్న విద్యుత్ వైర్లకు తగిలాడు. కరెంటు తీవ్రతకు ఒక్కసారిగా సజీవ దహనం అయ్యాడు. అందరూ చూస్తుండగానే కాలిబూడిదైపోయాడు. రైల్వే పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని రైలు ఇంజిన్ మీది నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గోవాకు వెళ్లే 12780 నెంబర్ గల హజ్రత్ నిజాముద్దీన్- వాస్కోడా గామా ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఆగింది. అంతకు ముందే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫ్లాట్ ఫారమ్ 1లోకి వచ్చాడు. ఆ తర్వాత టిన్ షెడ్ మీదికి వెళ్లాడు. అదే సమయంలో గోవా రైలు అక్కడికి వచ్చి ఆగడంతో దాని ఇంజిన్ మీదికి దూకాడు. రైలు ఇంజిన్ మీద ఉన్న విద్యుత్ వైర్లకు తగిలాడు. ఓవర్ హెడ్ పవర్ ధాటికి అతడి శరీరం కాలిపోయింది. క్షణాల్లోనే మంటల్లో కాలి బూడిదయ్యాడు. ఈ ఘటనతో వీరాంగన లక్ష్మీబాయి(ఝాన్సీ) రైల్వే స్టేషన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రయాణీకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయం తెలిసి వెంటనే స్పాట్ కు చేరుకున్న రైల్వే పోలీసులు, విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. ఆ తర్వాత నెమ్మదిగా డెడ్ బాడీని రైలు ఇంజిన్ మీది నుంచి కిందికి దించారు. పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.
మృతిడి వివరాలపై ఆరా తీస్తున్న రైల్వే పోలీసులు
అటు ఈ ఘటనలో చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ అతడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు ఇలా చేశాడు? అతడి మానసిక పరిస్థితి బాగానే ఉందా? లేదా? అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ సర్కిల్ ఆఫీసర్ నయీమ్ మన్సూరి వెల్లడించారు. మృతుడి వయసు దాదాపు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
Read Also: రైల్లో సీటు కోసం మర్డర్.. మరీ ఇంత దారుణమా!
⏺️गोवा एक्सप्रेस के पुल से इंजन के ऊपर कूदा युवक
⏺️हाई टेंशन लाइन की चपेट में आने से हुई दर्दनाक मौत
⏺️कड़ी मशक्क्त के बाद इंजन से उतारा गया शव
⏺️मृतक की अब तक नहीं हो सकी शिनाख्त@jhansipolice @spgrpjhansi #jhansi #abcnewsmedia pic.twitter.com/9VEXO9Xz0F
— Abcnews.media (@abcnewsmedia) December 7, 2024
సుమారు 45 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం
అటు ఈ ఘటనతో ఆ రూట్లో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోవా రైలు సుమారు 45 నిమిషాల పాటు ఝాన్సీ స్టేషన్ లోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇతర రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు రైళ్లను కాసేపు నిలిపివేశారు. గోవా రైలు ఝాన్సీ స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత మిగతా రైళ్లు యథావిధిగా తమ సర్వీసులను కొనసాగించాయి.
Read Also: ట్రయల్ రన్ కు రెడీ అవుతున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!