Immunity Booster Drinks: పెరుగుతున్న కాలుష్యం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా వాయు కాలుష్యం, మన శ్వాసతో శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులకు దారి తీస్తుంది. దీంతో జలుబు, దగ్గు, ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అటువంటి పరిస్థితిలో కషాయాలు కాలుష్యం నుండి రక్షించడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. శరీరాన్ని లోపల నుండి బలంగా మారడంలో సహాయపడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న కషాయాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1.అల్లం, తులసి, తేనె కషాయం:
కావలసినవి:
చిన్న ముక్క అల్లం- 1
తులసి ఆకులు- 5-6
తేనె- 1 టీస్పూన్
నీరు- 1 కప్పు
పైన చెప్పిన మోతాదులో నీరు తీసుకుని గ్యాస్ పై పెట్టి మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు, అల్లం, తులసి ఆకులు వేసి 5-10 నిమిషాలు ఉంచండి.తరువాత గ్యాస్ ఆఫ్ చేసి తేనె మిక్స్ చేసి ఈ డ్రింక్ రోజుకు రెండుసార్లు త్రాగాలి. ఈ కషాయం శరీరానికి శక్తిని అందించి, కాలుష్య ప్రభావం నుంచి కాపాడుతుంది.
అల్లం,తులసి, తేనెతో తయారు చేసిన కషాయం శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కాలుష్యం వల్ల కలిగే మంట, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.
2 . జీలకర్ర, అల్లం పొడి, పసుపు, నల్ల మిరియాలతో కషాయం:
కావలసినవి:
జీలకర్ర- 1 టీస్పూన్
పొడి అల్లం- 1 టీస్పూన్
పసుపు-1/4 టీస్పూన్
నల్ల మిరియాలు- 1/4 టీస్పూన్
నీరు- 1 కప్పు
అన్ని పదార్థాలను నీటిలో వేసి 10 నిమిషాలు గ్యాస్ పై పెట్టి మరిగించండి. తర్వాత ఈ డ్రింక్ వడకట్టి త్రాగండి. ఈ డికాక్షన్ శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా కాలుష్యం వల్ల కలిగే శారీరక సమస్యలను నివారిస్తుంది.
దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి కాలుష్యం వల్ల కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ఈ హెర్బల్ డికాక్షన్ సహాయపడుతుంది. మెంతులు, ఎండు అల్లం, పసుపు, నల్ల మిరియాలు అన్నీ సహజమైన మందులు. ఇవి శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
Also Read: ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగుతున్నారా ?
3. తులసి, అల్లం, నిమ్మకాయతో కషాయం:
కావలసినవి:
తులసి ఆకులు- 5-6
చిన్న ముక్క అల్లం- 1
నిమ్మకాయ రసం- 1 స్పూన్
నీరు- 1 కప్పు
తులసి, అల్లం నీళ్లలో వేసి మరిగించాలి. మరిగిన తర్వాత వడకట్టి అందులో నిమ్మరసం వేయాలి. ఈ కషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు త్రాగాలి. ఈ డికాక్షన్ శరీరాన్ని డిటాక్సిఫై చేసి కాలుష్యం నుండి కాపాడుతుంది. ఈ కషాయాలు రీరానికి సహజ ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.