BigTV English

Adilabad Airport: ఆదిలాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్.. ఇక్కడ మొదలయ్యే సేవలు ఇవే!

Adilabad Airport: ఆదిలాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్.. ఇక్కడ మొదలయ్యే సేవలు ఇవే!

Adilabad Airport: విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ వాసుల కలలు త్వరలోనే ఫలించబోతున్నాయి. ఆదిలాబాద్‌‍లోని రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో.. పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతో పాటు.. పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.


స్థానిక ప్రజలు, పలు పార్టీల నాయకుల నుంచి కొంతకాలంగా వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 29 జనవరి, 2025 నాడు లేఖ రాశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వ్యక్తిగతంగా కలిసి ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూములను ప్రజావసరాలకు సద్వినియోగం చేసేలా చొరవ తీసుకోవాలని కోరామని అన్నారు. దీనిపై వారు రక్షణ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత సానుకూల నిర్ణయాన్ని తెలియజేస్తూ నిన్న లేఖ రాశారని చెప్పుకొచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ సానుకూల స్పందనను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకుగానూ ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నామని చెప్పారు.

ALSO READ: AAI Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో 309 ఉద్యోగాలు.. రూ.1,40,000 జీతం..


పత్తి వ్యాపారానికి ఆదిలాబాద్ ప్రధాన కేంద్రం

‘పత్తి వ్యాపారానికి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఆదిలాబాద్ ప్రధానమైన కేంద్రంగా ఉంది. దీంతో ఆదిలాబాద్‌ తో పాటుగా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల నుంచి.. విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే విషయంలో చొరవ తీసుకోవాలని దశాబ్దాలుగా డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై నేను 7 జూలై 2022, 15 ఫిబ్రవరి 2023నాడు నాటి ముఖ్యమంత్రికి లేఖలు రాశాం. ఐదేళ్లుగా ఈ విషయంపై పదే పదే నేను ప్రస్తావించాను. అయినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గత రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు..

‘అటు, ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే విమానయాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని 2021 అక్టోబర్ లో నాటి పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా నాటి సీఎంకి లేఖ రాశారు. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. కానీ ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. వారి నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని.. నేను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడుకి లేఖలు రాయడంతో పాటుగా వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశాను’ అని చెప్పారు.

భూసేకరణను త్వరగా పూర్తి చేసి ఇస్తే.. పనులు వేగవంతం

‘ఇటీవలే వరంగల్ విమానాశ్రయానికి అనుమతులు లభించడంతో.. విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేసి ఇస్తే.. ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసేందుకు వీలవుతుంది. తద్వారా వీలైనంత త్వరగానే.. వరంగల్ ప్రజల స్వప్నం సాకారం కానుంది. గత నెలలో.. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు, ఇందుకు సంబంధించిన పురోగతి తదితర విషయాలను నేను, రామ్మోహన్ నాయుడు సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించాం’ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మరికొన్ని రూట్స్ అందుబాటులోకి..

‘రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ – ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (RCS-UDAN) పథకంలో భాగంగా.. దాదాపు 620 రూట్లలో ఇప్పటికే హైదరాబాద్‌కు 60 రూట్స్ (10%) ఆపరేషన్‌లో ఉన్నాయి. వరంగల్, ఆదిలాబాద్‌లో కూడా విమానాశ్రయాల సేవలు ప్రారంభిస్తే తెలంగాణకు ఉడాన్ (UDAN) కింద మరికొన్ని రూట్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇది ప్రజల ప్రయాణంతో పాటుగా.. ఈ ప్రాంతంలో వాణిజ్యాభివృద్ధికి కూడా తోడ్పడనుంది’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

గతంలోనే ఆదిలాబాద్ లో విమానాశ్రయం

‘ఆదిలాబాద్‌లో గతంలోనే విమానాశ్రయం ఉండేది. దీన్ని సైనిక అవసరాల కోసం మాత్రమే వినియోగించేవారు. కాలక్రమేణా.. వివిధ కారణాలతో రక్షణ శాఖ కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఈ విమానాశ్రయాన్ని తిరిగి యాక్టివేట్ చేయడం రక్షణశాఖకు, పౌర సేవలకు ఎంతో ఉపయోగపడనుంది. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. విమానాశ్రయాల ఏర్పాటు వల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు.. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు మార్గం సుగమం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఆయా విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించడంతో పాటుగా సంపూర్ణ సహకారం అందిస్తే.. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు వీలైనంత త్వరగా ప్రజలకు సేవలందిస్తాయి’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ALSO READ: BEL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతమైతే రూ.90,000.. ఇంకా 4 రోజులే భయ్యా..

Related News

Hydra Ranganath: హైడ్రా అదుర్స్.. రూ.400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది..

Serial effect: టీవీ సీరియల్ కోసం.. తల్లి, కొడుకు విషం తాగేశారు.. ఇదేం పిచ్చో!

Hyderabad Police: డీజేలకు నో.. హైదరాబాద్ భక్తులకు పోలీస్ గైడ్ లైన్స్ ఇవే!

Jaggareddy Vs ktr: కేటీఆర్‌పై పంచ్‌లు.. వారంతా డ్రామా ఆర్టిస్టులు-జగ్గారెడ్డి

Big Shock to KCR: కేసీఆర్‌‌కు హైకోర్టు షాక్, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, కాళేశ్వరం రిపోర్టుపై వ్యాఖ్య

Telangana Govt: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్, ఏది తగ్గినా నో ఛాన్స్

Big Stories

×