BigTV English
Advertisement

Rambha: రంభ రీఎంట్రీ అదుర్స్..సుధీర్ తో రొమాన్స్ మామూలుగా లేదుగా..!

Rambha: రంభ రీఎంట్రీ అదుర్స్..సుధీర్ తో రొమాన్స్ మామూలుగా లేదుగా..!

Rambha..అలనాటి అందాల తార.. కుర్రకారు డ్రీమ్ గర్ల్.. ప్రముఖ హీరోయిన్ రంభ (Rambha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . తన అందంతో, నటనతో ఒకానొక సమయంలో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. పిల్లలు, భర్త, వైవాహిక జీవితం అంటూ వ్యక్తిగత జీవితానికి పరిమితమైంది. అయితే ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తోంది రంభ. అందులో భాగంగానే ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తోంది. అటు తమిళ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఇప్పుడు తెలుగులో కూడా బుల్లితెరపై గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చేసింది. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ షో లో ఒక ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈమె .. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో రంభకు గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పారు.


రీ ఎంట్రీ ఇచ్చిన రంభ..

ఇకపోతే ఈ షో కి రంభతో పాటు బొంబాయి ప్రియుడు సినిమాలో రంభతో కలిసి నటించిన జేడీ చక్రవర్తి (JD.Chakravarthy) కూడా వచ్చి సందడి చేశారు. అంతేకాదు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) కూడా ఈ షోలో అలరించడం జరిగింది. ఇకపోతే రంభను చూసిన సుధీర్ ఈ షోలో రంభ కోసం పాట కూడా పాడారు. ముఖ్యంగా సుధీర్ పాటకు మైమరిచిపోయిన రంభ.. సుధీర్ తో కలిసి చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ఒక సీన్ ను రీ క్రియేట్ చేసి స్కిట్ వేశారు. దీంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది. అంతేకాదు బావగారు బాగున్నారా సినిమాలోని ఆంటీ కూతురు అనే పాటకి కూడా రంభతో కలిసి సుధీర్ వేసిన స్టెప్పులకు, అక్కడికి వచ్చిన సీరియల్ స్టార్స్ కూడా ఈలలతో షోని మరింత హోరెత్తించారు.


తన పాటలతో రంభ మనసు దోచుకున్న సుధీర్..

ఇకపోతే ఈ షోలో రంభకు కూడా పులిహోర కలిపి ప్రయత్నం చేశారు సుధీర్. ఆ ఒక్కటి అడక్కు సినిమా తర్వాత నా మనసు నీకే ఇచ్చేసాను అని రంభతో చెప్పగా.. రంభ వెంటనే గూగుల్ లో తెలుగులో సర్చ్ చేశాను. ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు అని.. అక్కడ మీ పేరే వచ్చింది సుధీర్ అంటూ సుధీర్ కి ఝలక్ ఇచ్చింది. ఇంత డ్రామా చేసే మీరు డ్రామా జూనియర్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటూ కూడా అన్నది.. మొత్తానికైతే రంభ చాలా చక్కగా తెలుగులో మాట్లాడి, అందరిని ఎంటర్టైన్ చేసింది. ఇక తర్వాత ఇదే కార్యక్రమానికి జెడి చక్రవర్తి కూడా హాజరయ్యారు. జెడి చక్రవర్తి – ఆషూ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ కూడా ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ లా అనిపించింది.ఇక సినిమా డైలాగులతో షో మొత్తాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చేశారు. ఇక చివర్లో సుధీర్ మెరుపు కలలు సినిమాలోని వెన్నెలవే వెన్నెలవే అనే పాటను రంభ కోసం పాడి ఆమె మనసు దోచుకున్నారు. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×