BigTV English

Pawan kalyan: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పవన్ కళ్యాణ్.. రూ.కోటి విరాళం చెక్కు అందజేత

Pawan kalyan: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పవన్ కళ్యాణ్.. రూ.కోటి విరాళం చెక్కు అందజేత

AP Deputy CM pawan kalyan Donates ₹1 crore to Telangana: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ వరద బాధితుల కోసం ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన పవన్..  ఆయనకు రూ. కోటి చెక్కును అందించారు. అనంతరం ఇద్దరూ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పోలీస్ విభాగం తరపున రూ.11 కోట్ల 6లక్షల 83వేల 571 ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెక్ ను అందజేసిన డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులు.


ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలూ అల్లల్లాడాయి. అంతా బాగుందనుకున్న వారి జీవితాలను తలకిందులు చేసింది. మళ్లీ మొదటికే తీసుకొచ్చింది. వరదల ధాటికి మునిగిన కాలనీల్లో జనం ఇంకా తేరుకోలేదు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. తలా ఓ చేయి వేస్తేనే వారంతా గండం గట్టెక్కే పరిస్థితి ఉంది. ఇండ్లల్లో ఏ ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా పోయింది. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు పనికి రాకుండా పోయాయి.

Also Read: మరింత పటిష్టంగా హైడ్రా.. ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది..


ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులు వరదల బాధితులకు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ కి రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. పక్క రాష్ట్రం, సోదర రాష్ట్రం అయిన తెలంగాణ కూడా భారీ వర్షాల కారణంగా వలదలతో దెబ్బతింది. తెలంగాణ రాష్ట్రానికి కోటి విరాళం అందజేస్తున్నాను. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేస్తానని ఇటీవల పంచాయితీ రాజ్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాడ్లాడిన సంగతి తెలిసిందే.

లలితా జ్యూవెలర్స్ యాజమాన్యం విజయవాడ వరదల బాధితులకు అండగా నిలిచారు. లలితా జ్యూవెలర్స్ యజమానికి కిరణ్ కుమారు రూ.కోటి విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. చంద్రబాబు 75 ఏళ్ల వయసులో కూడా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాడని కొనియాడారు. ఇంటికి కూడా వెళ్ళకుండ బస్సులోనే ఉంటూ వరద బాధితుల కోసం అండగా నలిచారని ప్రశంసలు కురిపించారు. డబ్బులు ఎవరికీ ఊరికేరావని ఇలాంటి సమయాల్లోనే మనకి తోచినంత సాయం చేయకోపోతే ఎంత సంపాదించిన దండగ అని ఆయన అన్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×