Hydra police: హైడ్రాపై మరింత దృష్టి సారించింది రేవంత్ సర్కార్. దీన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అక్రమ కూల్చివేతల సమయంలో పోలీసులు లేకపోవడంతో అధికారులకు కొంత సమస్యగా మారింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం, ప్రత్యేకంగా పోలీసులను కేటాయించింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలో చెరువుల పరిరక్షణకు తీసుకొచ్చిన వ్యవస్థ హైడ్రా. ఒకప్పుడు లేక్ సిటీగా ఉండే భాగ్యనగరం.. ఇప్పుడు చెరువులు దాదాపుగా కనుమరుగయ్యాయి. కబ్జారాయుళ్లు చెరువులను ఆక్రమణలు చేసి భారీ నిర్మాణాలు కట్టేస్తున్నారు. మరికొందరు వ్యాపారాలకు వినియోగించుకుంటున్నారు.
గడిచిన పదేళ్లు అక్రమ కట్టడాలు మరింత పెరిగాయి. దీన్ని గమనించిన రేవంత్ సర్కార్, హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పటికే హైదాబాద్ సిటీ పరిధిలో అక్రమణ కట్టడాలను కూల్చివేశారు. మరికొన్నింటికి నోటీసులు ఇచ్చారు.
ALSO READ: తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి
రేపోమాపో కొన్నింటికి కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నాయి. కూల్చివేతల సమయంలో కొందరు నిరసనకు దిగుతున్నారు. పరిస్థితి గమనించిన ప్రభుత్వం, ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
18 మంది సీఐ స్థాయి, ఐదుగురు ఎస్సై స్థాయి అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యూటేషన్‌పై ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణల తొలగింపులో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా పోలీసు కేసుల నమోదు, దర్యాప్తు కోసం హైడ్రాకు పోలీసుస్టేషన్లు ఈ నెలాఖరులో ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందులోభాగంగా తొలుత కొంతమంది పోలీసు అధికారులను కేటాయించింది.
మరోవైపు హైడ్రాకు సర్వాధికారులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలో సాగునీరు, రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ నుంచి సిబ్బంది కేటాయించనున్నారు. దీనికి సంబంధించిన ఫైల్ మంత్రుల వద్దకు చేరింది.
ముఖ్యంగా రెవిన్యూ, ఆక్రమణల నిరోధంచట్టంపై కలెక్టర్ల నుంచి కిందిస్థాయి వరకు ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అధికారాల బదలాయింపు తర్వాత హైడ్రాదే ఆజమాయిషీ అవుతుంది.
మరోవైపు మిగిలిన శాఖలకు సంబంధించిన ఫైళ్లు చకచకా కదులుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడమే మిగిలివుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రా కోసం చట్టం తెస్తారా? లేక ఆర్డినెన్స్ ద్వారా చట్ట బద్దత కల్పిస్తారా? అనేదానిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది.
హైడ్రాకు పోలీస్ సిబ్బందిని కేటాయించిన ప్రభుత్వం.
చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 మంది సీఐ స్థాయి, ఐదుగురు ఎస్సై స్థాయి పోలీసు అధికారులను హైడ్రాకు కేటాయించింది. ఈ మేరకు డిప్యూటేషన్ ఆదేశాలు ఇస్తూ… pic.twitter.com/tszd9AILWg
— BIG TV Breaking News (@bigtvtelugu) September 10, 2024