Armoor Ex-MLA Jeevan Reddy: బీఎర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఆయన ప్రత్యక్షమయ్యారని, ఆర్మూర్ బీజేపీ నేతలతో కలిసి రహస్య మంతనాలు జరిపారన్న వార్త బీఆర్ఎస్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన, బీజేపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఆర్మూర్‌లోని ఆయన మాల్‌కు అధికారులు తాళాలు వేసినప్పటి నుండి మౌనంగా ఉన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకోబోతున్నారా అనే చర్చకు ఈ భేటీ ఆజ్యం పోసింది.
అయితే, ఈ వార్తలపై జీవన్ రెడ్డి స్పందిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాను పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ శుద్ధ అబద్ధమని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మరియు బీజేపీలు చేస్తున్న కుట్రలో భాగంగానే తనపై ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. తనపై వస్తున్న ఫేక్ ప్రచారాలను మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.
“నా కంఠంలో ప్రాణమున్నంత వరకు కేసీఆర్ బాట వీడను.” అని జీవన్ రెడ్డి ఉద్ఘాటించారు. కేసీఆర్ తనకు రాజకీయ గురువు మాత్రమే కాదు, ఆరోగ్య దైవమని ఆయన అభివర్ణించారు. ఆర్మూర్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వర్గంతో ఉన్న విభేదాల నేపథ్యంలో, జీవన్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారన్న వార్త అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. కానీ, ఆయన క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ ఊహాగానాలకు తెరపడింది.
రాజకీయ విశ్లేషకులు మాత్రం, ఒకవేళ వ్యాపార పనుల కోసమే ఢిల్లీకి వెళ్తే బీజేపీ నేతలతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏముందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, జీవన్ రెడ్డి మాత్రం తాను కారు గుర్తును వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పరిణామం ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఊరటనిచ్చింది.
ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ప్రత్యక్షమైన బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి
ఆర్మూర్ బీజేపీ నేతలతో కలిసి కేంద్రమంత్రితో జీవన్ రెడ్డి రహస్య మంతనాలు
జీవన్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారా? అని రాజకీయ వర్గాల్లో మొదలైన జోరుగా చర్చ
కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా మాజీ… pic.twitter.com/qBCOpgCmK3
— BIG TV Breaking News (@bigtvtelugu) April 22, 2026
Read Also: RTC Bus Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు.. సీపీఎం మద్దతు.. చర్చలు జరపాలని ప్రభుత్వానికి డిమాండ్